Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే కుప్పకూలాయి. వరుసగా నాలుగోరోజు మార్కెట్లు నష్టపోయాయి. అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) 50 భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ (Bombay Stock Exchange) సూచీ సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా క్షీణించి 76,500కు పడిపోయింది. ఎన్ఎస్ఈ (National Stock Exchange) సూచీ నిఫ్టీ కూడా 23,172 పాయింట్లకు దిగి వచ్చింది.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 5 నిమిషాల్లోనే రూ.5 లక్షల కోట్లు ఆవిరై రూ.430 లక్షల కోట్ల నుంచి రూ.425 లక్షల కోట్లకు పడిపోయింది. గత నాలుగు సెషన్లలో చూస్తే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.17 లక్షల కోట్లు ఆవిరైంది. ఇవాళ స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలకు కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గత మూడు నెలల్లోనే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఆంక్షలు రష్యా చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్, చైనా దేశాలకు రష్యా అధిక చమురును సరఫరా చేస్తోంది. రష్యా లక్ష్యంగా జో బైడెన్ చుమురు, గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించారు.
రూపాయి పతనం
అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టస్థాయికి అంటే రూ.86.27 కు పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడటం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ట్రంప్ విధానాలపై అనిశ్చితి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్, చైనా సహా ఇతర దేశాలు లక్ష్యంగా ఆయన టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ టారిఫ్‌లు పెంచితే మాత్రం ఆసియా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదు.
FPIల విక్రయాలు
ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) 2025లో జనవరి 10వ తేదీవరకే రూ.21,350 కోట్ల విలువచేసే షేర్లను విక్రయించారు. డిసెంబర్లో రూ.16,982 కోట్లతో పోల్చితే అధికంగా విక్రయాలు జరిపారు. అక్టోబర్ నుంచి వారు వరుసగా విక్రయాలు జరుపుతూనే ఉన్నారు.
RN Ravi | ఇంత దురహంకారం మంచిది కాదు.. తమిళనాడు సీఎంపై గవర్నర్ కామెంట్స్
Maha Kumbh | మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. పట్టాలపైకి 13వేల రైళ్లు..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!