Maha Kumbh : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో మహా కుంభమేళా (Maha Kumbh) ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం గంగా (Ganga), యమునా (Yamuna), సరస్వతి (Saraswati) నదులు (Rivers) కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక మంది సమ్మేళనమైన కార్యక్రమంగా ఈ మహా కుంభమేళా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఈ కుంభమేళాకు దాదాపుగా 45 కోట్ల మందికిపైగా భక్తులు తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇది అమెరికా, రష్యా దేశాల జనాభా కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం.
కుంభమేళా ప్రతి పన్నేండేళ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే ఇప్పుడు జరిగేది మహా కుంభమేళా. ఈ మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇవాళ ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ సర్కారును ఆర్థికంగా ఎంతో బలోపేతం చేయనుంది. ఈ 45 రోజుల మహా కుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కారు రూ.7 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించింది.
అయితే మహా కుంభమేళాకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తే.. యూపీకి ఆదాయం రూపంలో దాదాపు రూ.2 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ భక్తులు 45 కోట్ల మంది రాకపోయినా 40 కోట్ల మందే వచ్చినా.. ఒక్కో భక్తుడు రూ.5 వేల చొప్పున ఖర్చు చేసినా రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నదని వారు చెబుతున్నారు. ఇక భక్తులు రూ.10 వేల చొప్పున ఖర్చు చేస్తే మొత్తం రూ.4 లక్షల కోట్ల ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
కాగా 2019లో జరిగిన అర్థ కుంభమేళా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. ఆ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు వచ్చారు. ఐదేళ్ల క్రితం 24 కోట్ల మంది భక్తులు వస్తేనే రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినప్పుడు.. ఈసారి 40 కోట్ల మంది కంటే ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రూ.2 లక్షల కోట్ల ఆదాయం రావడం అసాధ్యమేమీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
Stock markets | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం
Maha Kumbh | మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. పట్టాలపైకి 13వేల రైళ్లు..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!