Actress Honey Rose : సినీ నటి (Cinema Actress) హనీ రోజ్ (Honey Rose) ను లైంగికంగా వేధించిన కేసులో కేరళ (Kerala) కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి (Jewellery business man) బాబీ చెమ్మనూర్ (Boby Chemmanur) కు బెయిల్ మంజూరైంది. కేరళ హైకోర్టు (Kerala High Court) ఆయనకు బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కోర్టు సమగ్ర ఉత్తర్వులు వెల్లడించనుంది.
వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ తనను లైంగిక వేధించాడని నటి హనీరోజ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గత బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేరళ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బాబీ చెమ్మనూర్‌ను వాయనాడ్‌లో కస్టడీలోకి తీసుకుంది. హనీరోజ్ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే తనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంతో బాబీ చెమ్మనూర్ బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది.
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?