Atishi nomination : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కోలాహలం నెలకొన్నది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల కాగా.. 17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. గడువు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో నామినేషన్లు జోరందుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ ఇవాళ కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
వాస్తవానికి అతిషి సోమవారం నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. కానీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోలేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. దాంతో ఇవాళ ఉదయాన్నే ఆమె నామినేషన్ వేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్ అతిషి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్ దాఖలు చేయాలని భావించిన అతిషి ఉదయం కల్కాజీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాతో కలిసి కల్కాజీలో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లగా అప్పటికే సమయం మించిపోయింది.
దాంతో ఆమె నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. ఇవాళ ఉదయాన్నే వెళ్లి నామినేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
#WATCH | Delhi CM & AAP candidate from Kalkaji Assembly constituency, Atishi files nomination at District Election Office pic.twitter.com/EyiLYRBuH6
— ANI (@ANI) January 14, 2025
Actress Honey Rose | లైంగిక వేధింపుల కేసులో బాబీ చెమ్మనూర్‌కు బెయిల్
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?