Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోదీకి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్య పెద్ద తేడా లేదని, ఇద్దరూ ఇద్దరేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రచార వ్యూహాలు, తప్పుడు వాగ్దానాలనే కేజ్రీవాల్ కూడా అనుసరిస్తున్నారని విమర్శించారు. ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు వారి హక్కులు దక్కాలని మోదీ, కేజ్రీవాల్ కోరుకోవడం లేదని అన్నారు. అందుకే కులగణనపై ఇద్దరూ మౌనం దాల్చారని మండిపడ్డారు.
దేశంలో పేదలు పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని, ఈ సమస్యకు కులగణన ద్వారానే పరిష్కారం లభిస్తుందని రాహుల్‌గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఈ విషయంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. దేశ రాజధానిని పరిశుభ్రంగా మారుస్తానని, పారిస్లా తీర్చిదిద్దుతానని, అవినీతిని నిర్మూలిస్తానని చెప్పిన కేజ్రీవాల్ ఏమీ చేయలేదని విమర్శించారు.
ప్రధాని మోదీ తప్పుడు వాగ్దానాల లాగానే.. ఢిల్లీ మాజీ సీఎం ప్రచార వ్యూహం కూడా ఉన్నదని రాహుల్‌గాంధీ అన్నారు. దేవంలో ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు, మైనార్టీలకు వారి హక్కులు లభించడం లేదని, తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, రిజర్వేషన్లు పెంచుతామని ఆయన హమీ ఇచ్చారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో వచ్చే నెల 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్
Sharad Pawar | ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌కు మద్దతు నిలువాలి : శరద్‌పవార్
Arvind Kejriwal | వాళ్లు డబ్బు, బంగారం పంచినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? : అర్వింద్ కేజ్రీవాల్
Atishi nomination | కల్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. Video
Actress Honey Rose | లైంగిక వేధింపుల కేసులో బాబీ చెమ్మనూర్‌కు బెయిల్
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే