Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi assembly elections) నేపథ్యంలో అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. ప్రతిపక్ష బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని, పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై ఇవాళ కేజ్రీవాల్ స్పందించారు. రాహుల్‌గాంధీ తనపై విమర్శలు చేశారని, కానీ తాను ఆయన వ్యాఖ్యలపై మాట్లాడబోనని చెప్పారు. ఎందుకంటే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీని కాపాండేందుకు పనిచేస్తున్నారని, కానీ తాను మాత్రం దేశాన్ని కాపాడేందుకు పనిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత, బీజేపీ ఐటీ హెడ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ కేజ్రీవాల్‌ను విమర్శించారు.
కేజ్రీవాల్ దేశాన్ని కాపాడటం సంగతి పక్కన పెట్టి, ముందుగా తన న్యూఢిల్లీ అసెంబ్లీ సీటును కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు. అమిత్ మాలవీయ వ్యాఖ్యలను కేజ్రీవాల్ వెంటనే తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీని ఒక్క మాట అనగానే బీజేపీకి రోషం పొడుచుకొచ్చిందని అన్నారు. రాహుల్‌గాంధీ కంటే ముందు బీజేపీ స్పందించిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏళ్లుగా సాగుతున్న రహస్య ఒప్పందానికి ఇది నిదర్శనమని అన్నారు.
Sharad Pawar | ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌కు మద్దతు నిలువాలి : శరద్‌పవార్
Arvind Kejriwal | వాళ్లు డబ్బు, బంగారం పంచినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? : అర్వింద్ కేజ్రీవాల్
Atishi nomination | కల్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. Video
Actress Honey Rose | లైంగిక వేధింపుల కేసులో బాబీ చెమ్మనూర్‌కు బెయిల్
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే