Big discount | ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంత తగ్గిందంటే..!
Big discount | రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న తన మాన్యుమెంటల్ సేల్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. దాంతో వినయోగదారులు ఈ సేల్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది.
Big discount : రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నిర్వహిస్తున్న తన మాన్యుమెంటల్ సేల్‌లో ఐఫోన్ 16 (iphone 16) పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. దాంతో వినయోగదారులు ఈ సేల్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది. ‘ఐఫోన్ 16’ 128GB మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్సైట్లో రూ.67,999కి అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ప్రీమియం సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. నాన్-మెంబర్స్‌కు అయితే ఈ ఐఫోన్ రూ.69,999కు లభిస్తుంది.
ఈ ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్‌తోపాటు ఎంపిక చేసిన బ్యాంక్ డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లు కలుపుకుని రూ.64,499కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లతో రూ.3,500 వరకు అదనపు తగ్గింపును పొందొచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్/ప్రీమియం సభ్యులు అయితే ఐఫోన్ 16 బేస్ మోడల్ రూ.64,499కే వస్తుంది. నాన్-మెంబర్స్ ఈ ఫోన్‌ను రూ.66,499కి పొందవచ్చు.
ఫోన్ ప్రత్యేకతలు
ఈ ఐఫోన్లో 6.1 అంగుళాల OLED స్క్రీన్ ఉంటుంది. అదేవిధంగా 2556 x 1179 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. డెన్సిటీ విషయానికొస్తే 460 ppi పిక్సెల్. వాటర్, స్ప్లాషెస్, డస్ట్ ప్రొటెక్షన్‌తో ఈ ఐఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. ఫొటోలు తీసేందుకు, వీడియోలను రికార్డ్ చేసేందుకు ఈ ఫోన్ త్వరిత కెమెరా యాక్సెస్‌ను అందిస్తుంది. 48MP ఫ్యూజన్ కెమెరా ఉంది. ఇందులో 2x టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీల కోసం ƒ/1.9 ఎపర్చర్‌తో 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
వీటితోపాటు ఈ ఫోన్లో ఆడియో మిక్స్ వంటి కొత్త ఆడియో ఎడిటింగ్ టూల్స్, ఫోన్ ఫొటో, వీడియో క్యాప్చర్ సపోర్ట్, క్యాప్చర్ తర్వాత ఆడియో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ మెషిన్ లెర్నింగ్ ద్వారా నాయిస్‌ను తగ్గించగలదు. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. వీడియోగ్రఫీకి ఇది ఒక గ్రేట్ ఆప్షన్. A18 బయోనిక్ చిప్ ఆధారితమైన ఈ ఐఫోన్ పనితీరును మెరుగుపరచడానికి యాపిల్ ఇంటెలిజన్స్ సెకండ్ జనరేషన్ 3-నానోమీటర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
యాపిల్ ఇంటెలిజెన్స్
ఐఓఎస్ (iOS) 18 పై నడుస్తున్న ఈ ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెన్స్‌ను కూడా కలిగి ఉంది. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అప్డేట్తో లభించే అధునాతన ఫీచర్ల సూట్. యాపిల్ ఇంటెలిజెన్స్ iOS 18కి రైటింగ్ టూల్స్ తీసుకువస్తోంది. ఇవి వినియోగదారులు మెయిల్, నోట్స్, పేజెస్తోపాటు థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌ల వంటి యాప్‌లలో టెక్స్ట్‌ను రీరైట్ చేసేందుకు, ప్రూఫ్‌రీడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. అంతేగాక నోట్స్, ఫోన్ యాప్స్‌లో యూజర్లు ఆడియోను కూడా రికార్డ్, ట్రాన్స్‌స్క్రైబ్ లాంటివి చేయొచ్చు.
ఇవి కూడా చదవండి..
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలుకు నేడే ఆఖరు.. గడువు దాటితే ఏమవుతుందంటే..!
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్
Sharad Pawar | ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌కు మద్దతు నిలువాలి : శరద్‌పవార్
Arvind Kejriwal | వాళ్లు డబ్బు, బంగారం పంచినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? : అర్వింద్ కేజ్రీవాల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

