Virosh | టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహానంతరం విజయ్ స్వగ్రామానికి రావడంతో నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్‌పేట గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. నూతన దంపతుల రాకతో గ్రామంలో ఉత్సాహం వెల్లివిరిసింది. పెళ్లి తర్వాతి సంప్రదాయ ఆచారాల్లో భాగంగా ఈ జంట డప్పు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా గ్రామంలోకి ప్రవేశించారు. అనంతరం తులసిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆసీనులై, కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 400 మందికి పైగా ఆహ్వానితులు హాజరైనట్లు సమాచారం. విజయ్–రష్మికలను ఒక్కసారి చూడాలనే ఆశతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన నటులు సొంత ఊరిలో ఇంత సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలోని వీధులన్నీ జనంతో కళకళలాడాయి.
స్టార్ కపుల్ రాక నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వారి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముందస్తు పాసులు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ నేతృత్వంలో సీఐ నాగరాజు, బల్మూరు ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. టాలీవుడ్లో సెన్సేషన్‌గా నిలిచిన ఈ జంట తమ స్వగ్రామంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలు, ఫోటోలు అభిమానుల్లో విపరీతంగా షేర్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి.
Mr&mrs Deverakonda at his new residence for Satyanarayana varatham🙏❤️#VijayDeverakonda #RashmikaMandanna
— THE RWDY🗿X (@TheDEVERA_fan) March 2, 2026