Robotic Mules : భారత 77వ సైనిక దినోత్సవం (Army day) సందర్భంగా మహారాష్ట్ర (Maharastra) లోని పుణె సిటీ (Pune city) లో నిర్వహించిన ఆర్మీ పరేడ్‌లో రోబోటిక్ డాగ్స్ (Robotic dogs) తో చేసిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పుణెలోని బాంబే ఇంజినీరింగ్ గ్రూప్ (BEG) కు చెందిన పరేడ్ మైదానంలో ఈ మార్చ్ ఫాస్ట్ జరిగింది.
భారత సైన్యానికి చెందిన ప్రత్యేక టీమ్ ఈ మార్చ్‌పాస్ట్ నిర్వహించింది. ఈ టీమ్‌లోని సైనికులు నాలుగు పాదాలతో కూడిన 8 రోబోలను రిమోట్‌తో ఆపరేట్ చేశారు. మార్చ్ ఫాస్ట్‌లో ఈ రోబోలు క్రమశిక్షణతో ముందుకు సాగుతుండగా వాటి వెనుకే సైనికులు నడిచారు. రోబోల నడక శైలి వీక్షకులను ఆకట్టుకుంది. నాలుగు పాదాలతో కూడిన ఈ రోబోలను భారత సైన్యం అత్యాధునిక సాంకేతికతతో తయారు చేయించింది.
రక్షణ రంగ పరిశీలకులు వీటిని సాంకేతికతను సంతరించుకున్న కుక్కలు అని అంటున్నారు. ఈ రోబోలను ఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ (AeroArc Pvt Ltd) కంపెనీ తయారు చేసింది. అందువల్ల వీటికి ‘ఆర్క్‌వీ మ్యూల్’ (ARCV MULE) అని పేరుపెట్టారు. ఇప్పటివరకు ఏరోఆర్క్ కంపెనీ నుంచి భారత సైన్యం దాదాపు 100 రోబోలను కొనుగోలు చేసింది. ఈ రోబోలకు పెట్టిన పేరులోని MULE అనే పదానికి సవివర అర్థం ‘మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్’.
ఈ రోబోలను రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ ఇవి పనిచేయగలవు. పెరీమీటర్లు, సైనిక పహారా, రసాయన సంబంధిత ప్రమాదాలు, బయోలాజికల్ దాడులు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు ఆర్క్‌వీ మ్యూల్ రోబోలను మోహరిస్తారు. బాంబులను నిర్వీర్యం చేసేందుకు సైతం వీటిని వినియోగిస్తారు. ఆర్క్‌వీ మ్యూల్ రోబోలో ప్రధానంగా ఐదు భాగాలు ఉన్నాయి.
ఈ రోబోలోని కంప్యూట్ బాక్స్ అనే భాగం రోబోకు మెదడులా సాయం చేస్తుంది. ఈ రోబోలో ఒక బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే రోబో 20 గంటలపాటు పనిచేస్తుంది. రోబో తల వెనుక భాగంలో సెన్సార్స్ ఉంటాయి. వీటి సాయంతో పరిసరాల్లో ఏమేం ఉన్నాయనేది రోబో చూస్తుంది. కాళ్ల సాయంతో రోబో నడకను సాగిస్తుంది. సెకనుకు 3 మీటర్ల వేగంతో ఇవి నడవగలవు. ఈ రోబో బరువు 51 కేజీలు ఉంటుంది.
India’s first !!!
Special marchpast featuring eight advanced robotic mules (Q-UGVs), showcasing India’s military innovation at Military Day Parade in Pune 😍
— With Love India (@WithLoveIndiaX) January 15, 2025
చిన్నపాటి తుపాకులు, కెమెరాలు, డ్రోన్లను ఈ రోబోలు మోసుకెళ్లగలవు. గరిష్ఠంగా 12 కేజీల బరువును ఇవి మోయగలవు. ఈ రోబోలు మెట్లు ఎక్కగలవు. కొండ ప్రాంతాల్లో, బురదమయంగా ఉండే ప్రాంతాల్లో నడవగలవు. కనిష్ఠంగా మైనస్ 40 డిగ్రీల శీతల ఉష్ణోగ్రతలోనూ ఈ రోబోలు పనిచేయగలవు. గరిష్ఠంగా 55 డిగ్రీల మండుటెండల్లోనూ ఇవి యాక్టివిటీని చేయగలవు. ఈ రోబోలకు ఐపీ-67 రేటింగ్ లభించింది.
నీళ్లలో మునిగిపోయినప్పటికీ కాసేపటి వరకు ఈ రోబోలు యాక్టివ్గానే ఉంటాయి. దుమ్ముధూళి నుంచి రక్షణ ఉండేలా ఈ రోబోల నిర్మాణ స్వరూపం ఉంటుంది. ఈ రోబోలు ఎన్విడియా జేవియర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ రోబోను 15 నిమిషాల్లోనే వివిధ భాగాలుగా విడగొట్టి తిరిగి జోడించవచ్చు. కాగా 1949 జనవరి 15న ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పను భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమించారు. బ్రిటిషర్ల చివరి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుంచి కరియప్ప బాధ్యతలను స్వీకరించారు.
ఆ చారిత్రక రోజుకు గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 15న ఆర్మీ డే పరేడ్‌ను నిర్వహిస్తున్నారు. చాలా ఏళ్లపాటు దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ పరేడ్‌ను నిర్వహించారు. పుణెలో ఈ పరేడ్ నిర్వహించడం ఇదే తొలిసారి. 2023లో బెంగళూరులో, 2024లో లక్నోలో ఈ పరేడ్ జరిగింది.
Big discount | ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంత తగ్గిందంటే..!
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలుకు నేడే ఆఖరు.. గడువు దాటితే ఏమవుతుందంటే..!
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్