Crime news : ఈ నెల 18న అంటే మరో మూడు రోజుల్లో ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురును ఆమె తండ్రే అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని గ్వాలియర్ పట్టణం (Gwalior town) లో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. పోలీస్ అధికారులు, పంచాయతీ పెద్దలు చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దేశవాలీ తుపాకులతో తండ్రి, మరో వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌లోని గోలా కా మందిర్ ఏరియాకు చెందిన మహేశ్ గుర్జర్‌కు 20 ఏళ్ల కూతురు తనూ గుర్జర్ ఉంది. ఈ నెల 18న ఆమెకు పెళ్లి నిశ్చయించారు. అయితే తనూ గుర్జర్‌కు ఆ పెళ్లి ఇష్టం లేదు. తాను ప్రేమించిన విక్కీ అనే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని ఆమె పట్టుబట్టింది. దాంతో గత కొన్ని రోజులుగా కుటుంబసభ్యులు తనూను ఇంట్లో బంధించి కొట్టారు. తప్పించుకుని బయటకు వచ్చిన ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
తన కుటుంబం తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నదని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉన్నదని ఆ పోస్టులో పేర్కొన్నది. ఈ పోస్టు వైరల్ కావడంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీ పెద్దలు చెప్పినప్పటికీ.. తన కుటుంబం కుదిర్చిన సంబంధం కాకుండా తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తనూ తెగేసి చెప్పింది.
దాంతో తనూ ఇంటికి తీసుకెళ్లి నచ్చజెపుతానని ఆమె తండ్రి పోలీసులను కోరాడు. అయితే తండ్రితో ఇంటికి వెళ్లేందుకు తనూ నిరాకరించింది. తనను మహిళ సంరక్షణ కేంద్రంలో ఉంచాలని పోలీసులను కోరింది. దాంతో తాను తనూ ప్రైవేటుగా మాట్లాడుతానని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. ఎవరూ ఊహించని విధంగా తన దగ్గరున్న నాటు తుపాకీ తీసి ఛాతీలో కాల్చాడు.
అక్కడున్న పంచాయతీ పెద్దలకు, పోలీసులకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే.. తనూ కజిన్ రాహుల్ కూడా ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తనూ నుదుటిలోకి, మెడలోకి, కన్ను ముక్కుకు మధ్య ప్రాంతంలోకి ఆ బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంతో తనూ అక్కడికక్కడే కుప్పకూలింది. అప్రమత్తమైన పోలీసులు తనూ తండ్రి మహేశ్ గుర్జర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు హత్యకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న రాహుల్ కోసం గాలింపు చేపట్టారు. హత్యకు కొన్ని గంటల ముందు పోస్టు చేసిన ఓ వీడియోలో తనూ తను ప్రేమించిన విక్కీ గురించి చెప్పింది. విక్కీతో ఆరేండ్లుగా తాను ప్రేమలో ఉన్నానని, ముందుగా అతనితో పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకున్నారని, ఆ తర్వాత మాట మార్చారని పేర్కొంది. ఆ పోస్టు పెట్టిన కొన్ని గంటలకే తండ్రి చేతిలో ఆమె హత్యకు గురైంది.
Ravichandran Ashwin | బయట అనుకునేవన్నీ నిజాలు కావు.. రిటైర్మెంట్పై భారత బౌలర్ అశ్విన్
Robotic Mules | ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్.. Video
Big discount | ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంత తగ్గిందంటే..!
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలుకు నేడే ఆఖరు.. గడువు దాటితే ఏమవుతుందంటే..!
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్