పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ఒకేసారి వస్తుంది. అందుకే.. తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయాలా.. పెళ్లినాటి మధుర జ్ఞాపకాలను జీవితాంతం నెమరువేసుకునేలా సరికొత్తగా ప్లాన్ చేస్తుంటారు కొందరు. సాధారణంగా పెళ్లి చేసుకుంటే ఏముంటుంది మజా. కాస్త వెరైటీ ఉండాలి కదా.. అని ఈ మధ్య యూత్ చాలా కొత్తగా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ జంట కూడా తమ పెళ్లికి వచ్చిన అతిథులు వావ్ అనాలి అనుకున్నారు. తమ పెళ్లి చూసి వెళ్లి పది మందికి చెప్పుకోవాలి అనుకున్నారు. దాని కోసం.. ఈవెంట్ మేనేజ్మెంట్తో మాట్లాడి.. రౌండ్‌గా ఉండే ఓ ఊయల లాంటి ఓ సెటప్‌ను ఏర్పాటు చేయించారు. పెళ్లి మండపం మీదకు ఆ ఊయల మీద నిలబడి ఎంట్రీ ఇచ్చారు. దాని చుట్టూ క్రాకర్స్ వెలుగులో ఒక్కసారి పై నుంచి దాని మీద ఆ జంట నిలబడి వస్తోంది. పై నుంచి కొంత దూరం వచ్చాక.. కిందికి దిగే క్రమంలో అది ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇద్దరూ కిందపడిపోయారు.
వాళ్ల అదృష్టం కొద్ది చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘఢ్‌లోని రాయిపూర్లో చోటు చేసుకుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లు చేసిన పొరపాటు వల్ల ఇది జరిగిందని తెలిసింది. పెళ్లి ముందు జరిగే సంగీత్ సెలబ్రేషన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
During a wedding function in Raipur, the bride and the groom were on a swing suddenly, the harness snaps and the couple take a tumble both of them are safe with minor injuries @ndtv @ndtvindia pic.twitter.com/ABHa2AMDtK
— Anurag Dwary (@Anurag_Dwary) December 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసుల చేతుల్లోకి రూ.2650 కోట్ల ఆస్తి
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
రెండు చేతులు, ఒక కాలు లేకున్నా పోల్ డ్యాన్సర్‌గా పాపులర్ అయింది.. వీడియో వైరల్
21 ఏళ్ల క్రితం మిస్ అయిన ఇద్దరు టీనేజర్ల కేసును ప్రాణాలకు తెగించి ఛేదించిన యూట్యూబర్..
అప్పుడు చనిపోవాలనుకున్నాడు.. తన మెమోరీ పవర్‌తో ఇప్పుడు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు