50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసుల చేతుల్లోకి రూ.2650 కోట్ల ఆస్తి
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసులకు | ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 50 ఏళ్ల పాటు తమకు వారసత్వంగా రావాల్సిన ఆస్తి కోసం పొరాడారు ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ను
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 50 ఏళ్ల పాటు తమకు వారసత్వంగా రావాల్సిన ఆస్తి కోసం పొరాడారు ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ను అప్పట్లో పాలించిన ఉమ్మడి నవాబు రజా అలీ ఖాన్ వారసులు. అలీఖాన్‌కు చెందిన సుమారు రూ.2650 కోట్ల ఆస్తిని షరియత్ రూల్స్ ప్రకారం.. తన 16 మంది చట్టబద్ధ వారసులకు త్వరలో పంచి ఇవ్వనున్నారు. ఈ ఆస్తి కోసం వారసులు 50 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.

పార్టిషన్ స్కీమ్ ప్రకారం.. రామ్‌పూర్ జిల్లా జడ్జ్ ఈ తీర్పును వెలువరించారు. జులై 31, 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ తీర్పును రామ్‌పూర్ కోర్టు వెల్లడించింది.
16 మంది వారసులలో ఒక వారసుడు కజిమ్ అలీ ఖాన్ తరుపున వాదించిన న్యాయవాది ముకేశ్ సక్సేనా తుది తీర్పు కోసం ఫైల్‌ను సుప్రీంకోర్టుకు పంపించామని తెలిపాడు.
అప్పట్లో రామ్‌పూర్‌ను పాలించిన నవాబ్ రజా అలా ఖాన్.. 1947 లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఇండియాలో రామ్‌పూర్‌ను విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. తర్వాత 1949లో రామ్‌పూర్‌ను ఇండియాలో విలీనం చేశాడు. ఆయన 1966లో మరణించాడు. ఆయనకు ముగ్గురు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు ఉండేవారు.
రామ్‌పూర్‌ను భారత్‌లో విలీనం చేశాక.. ఆయన ఆస్తులకు ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడైన ముర్తాజా అలీఖాన్ మాత్రమే అసలైన వారసుడని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నవాబు మిగతా కొడుకులు ఇద్దరూ 1972 లో కోర్టులో కేసు వేశారు. అప్పటి నుంచి ఆ కేసు కోర్టులో నానుతూ వచ్చింది.
నవాబు అలీఖాన్ వారసుల్లో పెద్దకొడుకు ముర్తాజా కూతురు నిఖత్ బి, కొడుకు మురాద్ మియాన్, నవాబు మరో కొడుకు జుల్ఫికర్ అలీ ఖాన్ బహదూర్ భార్య బేగం నూర్ బానో(మాజీ ఎంపీ), ఆమె కొడుకు నవెద్ మియాన్, ఇతరులు ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రాపర్టీలో 200 ఎకరాల బెనజిర్ బాగ్ ప్యాలెస్, సర్హారీ కుందా ప్యాలెస్, షాహ్‌బాద్ బాగ్ ప్యాలెస్, ప్రైవేట్ రైల్వే స్టేషన్‌ను 16 మంది వారసులకు సమానంగా పంచనున్నారు. 16 మందిలో ఇద్దరు వారసులు మరణించారు. చనిపోయిన వారి వారసులకు ఆ షేర్‌ను అందిస్తామని వాళ్ల తరుపు లాయర్ తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
రెండు చేతులు, ఒక కాలు లేకున్నా పోల్ డ్యాన్సర్‌గా పాపులర్ అయింది.. వీడియో వైరల్
21 ఏళ్ల క్రితం మిస్ అయిన ఇద్దరు టీనేజర్ల కేసును ప్రాణాలకు తెగించి ఛేదించిన యూట్యూబర్..
అప్పుడు చనిపోవాలనుకున్నాడు.. తన మెమోరీ పవర్‌తో ఇప్పుడు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

