రెండు చేతులు, ఒక కాలు లేకున్నా పోల్ డ్యాన్సర్‌గా పాపులర్ అయింది.. వీడియో వైరల్
పోల్ డ్యాన్సర్‌గా పాపులర్ | ఇటలీలోని పెరుగియాకు చెందిన 15 ఏళ్ల ఫ్రాన్సెస్కా సెసారని పుట్టడమే చేతులు లేకుండా.. ఒకే కాలుతో పుట్టింది. దీంతో తన సొంతంగా ఏ పనీ చేసుకోలేదు

ఇటలీలోని పెరుగియాకు చెందిన 15 ఏళ్ల ఫ్రాన్సెస్కా సెసారని పుట్టడమే చేతులు లేకుండా.. ఒకే కాలుతో పుట్టింది. దీంతో తన సొంతంగా ఏ పనీ చేసుకోలేదు. ఆహారం కూడా తీసుకోలేదు. దీంతో తన తల్లి తనను 24 గంటలు దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది.

కానీ.. ఫ్రాన్సెస్కా పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ.. తనకు ఓ లక్ష్యం ఏర్పడింది. అదే అక్రోబాటిస్ పోల్ డ్యాన్సర్(acrobatic pole dancer). అంటే పోల్ డ్యాన్స్ చేస్తూ విన్యాసాలు చేయడం అన్నమాట. నిజానికి.. పోల్ డ్యాన్స్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. ఫ్రాన్సెస్కాకు అస్సలు కుదరదు. తనకు చేతులు లేవు. ఒక కాలు లేదు. అమ్మా.. నేను పోల్ డ్యాన్సర్‌ని అవుతా.. అని చెప్పినప్పుడు తన తల్లి ఆశ్చర్యపోయింది. ఇటీవల 2021 లో ఇంటర్నేషనల్ పోల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో వర్చువల్ వరల్డ్ పోల్, ఏరియల్ చాంపియన్‌షిప్‌లో పార్టిసిపేట్ చేసింది ఫ్రాన్సెస్కా.
కోవిడ్ వల్ల.. పోల్ డ్యాన్సర్లు అందరూ వాళ్ల పోల్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలను వర్చువల్‌గా జడ్జిలకు పంపించగా.. అంగ వైకల్యం కేటగిరీలో ఫ్రాన్సెస్కా గోల్డ్ మెడల్‌ను సాధించింది.

చిన్నప్పటి నుంచే కృత్రిమ కాలును పెట్టుకొని.. ఫ్రాన్సెస్కా పోల్ డ్యాన్సింగ్‌లో శిక్షణ పొంది నేడు అందరూ గర్వించదగ్గ పోల్ డ్యాన్సర్‌గా ఎదిగింది.
తనకు రెండు చేతులు, ఒక కాలు లేకున్నా.. ఎంతో కష్టపడి పోల్ డ్యాన్సర్‌గా విజయం సాధించింది. తనకు ఏం కావాలో.. జీవితంలో ఏం సాధించాలో ఓ క్లారిటీ ఉంది. అందుకే.. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మేము ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాం.. అని ఫ్రాన్సెస్కా తండ్రి మార్కో తెలిపారు.
WATCH: Meet the Italian teen with one leg and no hands finding freedom in acrobatic pole dancing https://t.co/Bmwak6cP8g pic.twitter.com/DTyAHY7y3Z
— Reuters (@Reuters) December 11, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఐస్ స్కేటింగ్ చేసి అందరిలో స్ఫూర్తి నింపిన 77 ఏళ్ల క్యాన్సర్ పేషెంట్.. వీడియో వైరల్
ఒక్క క్షణం ఆలస్యమైనా.. ఆ వృద్ధుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.. వైరల్ వీడియో
21 ఏళ్ల క్రితం మిస్ అయిన ఇద్దరు టీనేజర్ల కేసును ప్రాణాలకు తెగించి ఛేదించిన యూట్యూబర్..
పబ్‌లో దెయ్యం.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను మరిపించేలా ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ వేసిన ఫారెనర్స్.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

