క్యాన్సర్ ఉన్నవాళ్లు ఏ పనీ చేయకూడదు. చివరకు మంచి మీది నుంచి దిగడానికి వీలు ఉండదు. అందులో.. 4వ స్టేజ్‌లో ఉన్న వ్యక్తి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ వయసు మళ్లిన వాళ్లు ఇంకెంత అలర్ట్‌గా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోతాయి. కానీ.. అవేవీ పట్టించుకోలేదు ఓపెద్దాయన.
తనకు చావు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ.. ఆ చావు వచ్చేలోపు తాను ఏదైనా చేయాలనుకున్నాడో అది చేసేశాడు. ఎవ్వరూ చేయని సాహసం చేశాడు. ఐస్ మీద స్కేటింగ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనకు ఐస్ స్కేటింగ్ నేర్పించే ట్రెయినర్‌తో కలిసి.. ఆ వ్యక్తి స్కేటింగ్ చేశాడు. తనకు 4వ స్టేజ్ ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందన్న విషయాన్ని మరిచిపోయి.. చిన్నపిల్లాడిలా స్కేటింగ్ చేయడంతో ఆ వృద్ధుడి ధైర్యాన్ని, సాహసాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వయసు అనేది దేనికీ అడ్డంకి కాదు. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసేయండి.. ఈయన చూసి అయినా స్ఫూర్తి పొందండి అంటూ నెటిజన్లు కూడా ఉచిత సలహాలు ఇస్తున్నారు.
ఈ వీడియోను ఆ వ్యక్తి కూతురు.. రెబెకా బాస్టియన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మా నాన్న వయసు 77 ఏళ్లు. ఆయనకు 4వ స్టేజ్ ప్రొస్టేట్ క్యాన్సర్. గతంలో ఐస్ స్కేటింగ్ నేర్చుకోవాలని మా నాన్న కలలు కనేవారు. ఇప్పుడు ఆయనకు తీరిక దొరికింది. దీంతో తన టీచర్‌తో కలిసి ఆయన స్కేటింగ్ పర్ఫార్మ్ చేశారు. ఏదో చేయాలనుకొని.. సమయం లేదు అని.. ఇక తమ వళ్ల కాదు అని తమ కోరికలను, తమ ఆశయాలను, తమ కలలను చంపుకునే వారికోసమే ఈ వీడియో అంటూ ఆమె ఈ వీడియోను పోస్ట్ చేశారు.
My father is 77 years old and has stage 4 prostate cancer. He decided to learn how to ice skate a few years ago, and just did this performance with his teacher.
— Rebekah Bastian (@rebekah_bastian) December 9, 2021
For anyone that thinks it’s too late to try something new… ❤️ pic.twitter.com/0SZ3FmbNGE
Omg I got such a warm fuzzy feeling watching that video… His performance was brilliant 🤩
— Erica Fleming (@EricaHome1) December 10, 2021
Tell your dad that I am in awe of him ❤️ pic.twitter.com/KOjUL0hdAJ
What a wonderful thing to share with us all ☺️💕. As my dear old ma used to say "where there's life there's hope." Your dad's performance was a beautiful one, and so joyfully inspiring
— HighSierra (@HighSierraMadre) December 9, 2021
I"m not crying, you're crying. pic.twitter.com/5i6FrrDaot
— Felicia Zard (@taebo2017) December 10, 2021
He's inspiring! 💙🙏😢 pic.twitter.com/CTh0b13FMO
— Chrissy💙 (@FanastaciaLA) December 9, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒక్క క్షణం ఆలస్యమైనా.. ఆ వృద్ధుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.. వైరల్ వీడియో
21 ఏళ్ల క్రితం మిస్ అయిన ఇద్దరు టీనేజర్ల కేసును ప్రాణాలకు తెగించి ఛేదించిన యూట్యూబర్..
పబ్‌లో దెయ్యం.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను మరిపించేలా ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ వేసిన ఫారెనర్స్.. వైరల్ వీడియో
OTT | 2008లోనే భారత్‌లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో లాభమా? నష్టమా?