ఎట్టెట్టా.. పబ్‌లోకి దెయ్యం వచ్చిందా.. అంటూ నోరెళ్లబెట్టకండి. మీరు చదివింది నిజమే. ఆ పబ్‌లో దెయ్యం ఉంది. ఆ విషయం సీసీకెమెరాలో రికార్డు అయింది. సీసీటీవీ ఫుటేజ్ చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.
గత కొన్ని రోజుల కింద యూకేలోని ఓ పబ్‌లో దెయ్యం ఉందని.. అది బీరు గ్లాస్ పగులగొట్టిందని చదువుకున్నాం గుర్తుందా? దానికి హాంటెడ్ బార్ అంటూ పేరు కూడా పెట్టాం. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది కదా. తాజాగా.. యూకేలోనే సౌత్ వ్రాక్సాల్లో లాంగ్ ఆర్మ్స్ అనే బార్లో కూడా విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.
పబ్‌లో ఉన్న గ్లాస్ ఒక్కసారిగా దానికదే పగిలిపోయింది. ఈ ఘటనతో అక్కడే ఉన్న ఓ మహిళ భయపడిపోయింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో ఆ వీడియోను బార్ సిబ్బంది తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
జార్జ్ అనే దెయ్యం.. ఈరోజు రాత్రికి ఈ పబ్‌లో సందడి చేయనుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.. అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఇక ఊరుకుంటారా? కామెంట్ల మీద కామెంట్లు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
So #George our resident ghost👻 is playing up tonight, keep watching the bottom shelf👻😬👻👻👻👻👻 pic.twitter.com/PnoWqwMvjY
— The Longs Arms (@TheLongsArms) December 4, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను మరిపించేలా ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ వేసిన ఫారెనర్స్.. వైరల్ వీడియో
OTT | 2008లోనే భారత్‌లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో లాభమా? నష్టమా?
mini bengal | తెలంగాణలో మినీ బెంగాల్.. కట్టుబొట్టూ అంతా ఉత్తరాది స్టైలే !!
లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్‌ను మింగిన ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?