ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ ఏదంటే టక్కున ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు అని చెప్పొచ్చు. ఆ పాట కన్నా.. అందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన డ్యాన్స్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి.
ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకొని చేసిన డ్యాన్స్ తీరును చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. అందులోనూ ఫాస్ట్ ఫార్వార్డ్ డ్యాన్స్ వేసి.. ఎన్టీఆర్, రామ్‌చరణ్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకే భారతదేశ సినిమా ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేశారు.
ఈ పాట విడుదలైన తర్వాత.. ఈ పాట మీద చాలామంది స్టార్స్ డ్యాన్స్‌ను అనుకరించారు. చాలామంది వాళ్ల డ్యాన్సులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే.. ఒక ఫారెనర్.. తన ఫ్రెండ్‌తో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ వేశాడు. డ్యాన్స్ వేసిన వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.
ఫ్రాన్స్‌కు చెందిన జికా.. తన ఫ్రెండ్ యోనెస్తో కలిసి స్టెప్పులేశాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను మైమరిపించేలా వీళ్లు వేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.