టైటిల్ చదవగానే ఎందుకో డౌట్ కొట్టినట్టు అనిపించిందా? ఐస్ క్రీమ్ చల్లగా కాకపోతే వేడిగా ఉంటుందా.. అని చిరాకు పడుతున్నారా? అవును.. మీరు చదివింది నిజమే. ఐస్‌క్రీమ్ చల్లగా ఉందని ఓ కస్టమర్.. రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేశాడు. ఇదెక్కడి విడ్డూరం కాకపోతే ఐస్‌క్రీమ్ చల్లగా ఉండకపోతే.. వేడిగా ఉంటుందా అని ఆ రెస్టారెంట్ కూడా అదే మొత్తుకుంది. కానీ.. కస్టమర్ వింటే కదా.. ఇలాంటి విచిత్రమైన కస్టమర్లు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది కదా. పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
యూకేలోని ఓల్డ్‌హామ్‌లో హాసన్ హాబిబ్ అనే వ్యక్తికి జస్ట్ ఈట్ అనే రెస్టారెంట్ ఉంది. అందులో టేక్ అవే కూడా ఉంటుంది. అంటే.. ఫుడ్ పార్శిల్ చేసి తీసుకెళ్లొచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. దాన్నే అదునుగా తీసుకొని.. చాలామంది ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆర్డర్ డెలివరీ అయ్యాక కుంటి సాకులు చెప్పి.. మనీ రిఫండ్ చేయాలంటూ రెస్టారెంట్‌పై ఫిర్యాదులు చేస్తున్నారట.
ఆ ఫిర్యాదులు కూడా ఎలా ఉంటున్నాయంటే.. ఓ వ్యక్తి మిల్క్‌షేక్, చీజ్ కేక్, ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి.. ఆర్డర్ డెలివరీ అయిన వెంటనే మనీ రిఫండ్ చేయాలని.. దానికి కారణం.. ఐస్‌క్రీమ్ చల్లగా ఉందని రిఫండ్ రిక్వెస్ట్ పెట్టాడట. ఇలా చాలామంది సిల్లీ కారణాలతో మనీ రిఫండ్ అడుగుతుండటంతో రెస్టారెంట్ ఓనర్.. ఆన్లైన్ ఆర్డర్స్, టేక్ అవే, పార్శిల్ సిస్టమ్‌ను ఆపేశాడట.
యూకేలో ఫుడ్ మీద ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా.. ఆ రెస్టారెంట్ వెంటనే మనీని కస్టమర్‌కు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు కస్టమర్లు కావాలని ఫుడ్ బాగోలేదని.. ఇతర కారణాలతో రిఫండ్ పెడుతుండటంపై జస్ట్ ఈట్ రెస్టారెంట్ ఓనర్.. తప్పని సరి పరిస్థితుల్లో పార్శిన్ సిస్టమ్‌ను ఆపేసి.. ఎవరైనా కస్టమర్ ఫుడ్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే.. దానికి కొంత చార్జ్ వసూలు చేయడం మొదలు పెట్టాడు. అలాగే.. కనీసం 30 రోజుల వ్యవధి తీసుకొని ఆలోపు నిజంగానే ఫుడ్‌లో ఏదైనా సమస్య ఉంటే.. రిఫండ్ ఇవ్వడం ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన ‘పోహా’ అమ్ముతూ జీవనం.. ఈ వృద్ధ జంట కష్టాలు తెలిస్తే కన్నీళ్లాగవు
Train | పెరుగు కోసం రైలు ఆపేసిన డ్రైవర్.. వీడియో వైరలవడంతో..
కూతుళ్లకు టీ ఎలా చేయాలో నేర్పించిన యూఎస్ ఫేమస్ డాక్టర్ సంజయ్ గుప్తా: వీడియో వైరల్
Anand Mahindra : 900 మంది ఉద్యోగులను జూమ్ కాల్లో తీసేసిన ఘటనపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
Bipin Rawat : బిపిన్ రావత్‌కు ఘనమైన నివాళి.. దేశమంతా సెల్యూట్: వీడియో వైరల్