ఇండియన్స్‌కు చాయ్ అనేది చాలా ముఖ్యమైన పానీయం. అది లేకపోతే.. రోజే గడవదు. కానీ.. ఇప్పుడు ఆ చాయ్ ఖండాంతరాలు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా చాయ్ తాగే వాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారు.
తాజాగా.. యూఎస్‌లో స్థిరపడిన ఇండియన్ డాక్టర్ సంజయ్ గుప్తా కూడా తన కూతుళ్లకు చాయ్ ఎలా తయారు చేయాలో నేర్పించారు. అమెరికాలో సంజయ్ గుప్తా.. ఫేమస్ న్యూరోసర్జన్. ఆయన తల్లిదండ్రులు పాకిస్థాన్‌తో విడిపోకముందు.. ఇండియాలో నివసించేవారు. ఇక్కడి నుంచి యూఎస్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. సంజయ్ గుప్తా కూడా అక్కడే జన్మించారు.
అయితే.. సంజయ్ గుప్తా తల్లి తనకు స్పెషల్ చాయ్ ఎలా తయారు చేయాలో నేర్పించిందట. ఆ చాయ్‌నే తను చాలా ఏళ్ల నుంచి తాగుతున్నారట. అదే తనకు వారసత్వంగా తన తల్లి ఇచ్చిందని భావించిన సంజయ్ గుప్తా.. దాన్ని తయారు చేసే విధానాన్ని తన కూతుళ్లకు కూడా నేర్పించారు.
మా అమ్మ నాకు ఈ స్పెషల్ చాయ్ చేయడం నేర్పించింది. మీరు కూడా ఈ చాయ్ చేయడం నేర్చుకోవాలి. దాని తయారీ విధానం ఏంటో మీకు చూపిస్తాను అని.. చాయ్ తయారీ కోసం బ్రౌన్ షుగర్, అల్లం, యాలకులు, బ్లాక్ టీ బ్యాగ్స్‌ను సిద్ధం చేసి.. వాళ్లతో చాయ్ చేయడం నేర్పించారు.
దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ఇది చాయ్‌లా లేదే.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేశారు. కొందరు మాత్రం తన అమ్మ నేర్పించిన చాయ్‌ని ఇప్పటికీ మరిచిపోకుండా..సంప్రదాయంగా దాన్ని తన కూతుళ్లకు నేర్పించిన డాక్టర్‌కు సెల్యూట్ కొడుతున్నారు.
Continuing family tradition, Dr. Sanjay Gupta teaches his daughters the chai recipe he learned from his mother. https://t.co/wVDFVQ6l67 pic.twitter.com/M4gxsjGxqu
— CNN (@CNN) December 9, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Anand Mahindra : 900 మంది ఉద్యోగులను జూమ్ కాల్లో తీసేసిన ఘటనపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
Bipin Rawat : బిపిన్ రావత్‌కు ఘనమైన నివాళి.. దేశమంతా సెల్యూట్: వీడియో వైరల్
కత్రినా, విక్కీ పెళ్లిపై డ్యురెక్స్ కండోమ్ బ్రాండ్ మీమ్ వైరల్
చెరుకు రసం నుంచి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఈ వీడియో చూసి తెలుసుకోండి