భారత జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్లు మన దేశానికి చేసే సేవ చాలా గొప్పది. అందుకే జవాన్ల తర్వాతనే ఎవరైనా. జవాన్లకు మనం ఇచ్చే గౌరవం కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా క్షణాల్లో అక్కడ వాలుతారు జవాన్లు. సహాయక చర్యల్లో పాల్గొంటారు.
తాజాగా బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్మీ జవాన్లు ఎక్కువగా ఉపయోగించే మారుతీ సుజికీ గిప్సీ వాహనం పార్ట్స్‌ను రెండే రెండు నిమిషాల్లో తీసేసి.. మళ్లీ ఫిక్స్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. తమ రొటీన్ డ్రిల్‌లో భాగంగా 8 మంది జవాన్లు సుజికీ గిప్సీ వాహనంపై కాసేపు తిరిగి.. వాహనాన్ని ఆపేసి వాహనంలోని పార్ట్స్నే టూల్స్‌గా చేసుకొని ఒక నిమిషంలో పార్ట్స్ అన్నీ విప్పేశారు.
ఆ తర్వాత వెంటనే పార్ట్స్ అన్నింటినీ ఫిక్స్ చేసి.. అదే వాహనంలో కూర్చొని బీఎస్ఎఫ్ జవాన్లు కాసేపు పరేడ్ చేశారు. ఆ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఆర్మీ అధికారులు హాజరయ్యారు. రెండే నిమిషాల్లో జవాన్లు కారును పూర్తిగా విప్పదీసి.. మళ్లీ ఫిక్స్ చేయడంతో.. అధికారులంతా చప్పట్ల మోత మోగించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఇవే
Bipin Rawat | తండ్రి బాటలో సైన్యంలోకి.. ట్రబుల్ షూటర్‌గా దేశానికి సేవ