Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఇవే
ట్విట్టర్లో ఏదైనా ట్వీట్ బాగా పాపులర్ కావాలి | అన్నింటి నడుమ.. మనిషి జీవనం సాగుతూనే ఉంది. ఈనేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో 2021లో తెగ పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఏంటో ఓసారి చూసొద్దాం రండి.
అయిపాయె.. ఇంకో 22 రోజుల్లో మరో సంవత్సరం కూడా ముగిసిపోనుంది. 2020తో పాటు 2021 సంవత్సరాన్ని కూడా కరోనా నామ సంవత్సరంగానే ముగించేస్తున్నాం. అయితే.. 2021లో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని దుఃఖాలు, కొన్ని సంతోషాలు.. అన్నింటి నడుమ.. మనిషి జీవనం సాగుతూనే ఉంది. ఈనేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో 2021లో తెగ పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఏంటో ఓసారి చూసొద్దాం రండి.

ట్విట్టర్లో ఏదైనా ట్వీట్ బాగా పాపులర్ కావాలి అంటే.. ముందు దాన్ని ట్వీట్ చేసిన వాళ్లు పెద్ద సెలబ్రిటీ అయి ఉండాలి.. లేదంటే ఆ ట్వీట్‌కు ఎక్కువ రీట్వీట్లు అయినా వచ్చి ఉండాలి. అలా.. 2021లో ఎక్కువ రీట్వీట్లు చేసిన ట్వీట్ ఏదో తెలుసా? ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ చేసిన ట్వీట్.
కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం ఇండియాకు ఆయన చేసిన డొనేషన్‌కు సంబంధించిన ట్వీట్‌ను ఇండియన్స్ ఎక్కువగా రీట్వీట్ చేశారు. దీంతో అది 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్లో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది.
— Pat Cummins (@patcummins30) April 26, 2021
ఇక.. ఎక్కువమంది లైక్ చేసిన ట్వీట్ ఏదో తెలుసా? ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్. విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మకు పండంటి కూతురు పుట్టిన సమయంలో చేసిన ట్వీట్ అది.
2020లో కూడా అత్యధిక లైక్స్ వచ్చిన ట్వీట్ విరాట్ కోహ్లీదే. తన భార్య అనుష్క శర్మ.. ప్రెగ్నెంట్ అని అందరికీ చెబుతూ చేసిన ట్వీట్ అది, వరుసగా రెండేళ్ల పాటు అత్యధిక లైక్స్‌ను సంపాదించుకున్న ట్వీట్లు విరాట్ కోహ్లీవే కావడం గమనార్హం.
— Virat Kohli (@imVkohli) January 11, 2021
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఆయన చేసిన ట్వీట్ మోస్ట్ రీట్వీట్లు చేసిన ట్వీట్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
ఆ తర్వాత ఎక్కువ లైక్స్ వచ్చిన మరో ట్వీట్ ప్రధాని మోదీ చేసిందే. టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలిచిన తర్వాత మోదీ ఆ ట్వీట్ చేశారు. ఆ తర్వాత వరుసగా రతన్ టాటా చేసిన ఎయిర్ ఇండియాకు సంబంధించిన ట్వీట్, తమిళ్ హీరో విజయ్ చేసిన తన కొత్త సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ ట్వీట్, ఎంఎస్ ధోనీ గురించి కోహ్లీ చేసిన ట్వీట్.. టాప్‌లో నిలిచాయి.
We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours.
— Narendra Modi (@narendramodi) January 19, 2021
#Beast pic.twitter.com/VgMlmH1Gno
— Vijay (@actorvijay) June 21, 2021
Anddddd the king is back ❤️the greatest finisher ever in the game. Made me jump Outta my seat once again tonight.@msdhoni
— Virat Kohli (@imVkohli) October 10, 2021
టాప్ 10 పాపులర్ హ్యాష్‌ట్యాగ్స్ ఇవే
ఇక.. టాప్ 10 పాపులర్ హ్యాష్‌ట్యాగ్స్ విషయానికి వస్తే.. #Covid19, #FarmersProtest, #TeamIndia, #Tokyo2020, #IPL2021, #IndVEng, #Diwali, #Master, #Bitcoin, #PermissionToDance హ్యాష్‌ట్యాగ్స్ టాప్ 10లో నిలిచాయి. ఇందులో కోవిడ్ 19, రైతుల ఆందోళన, టీమ్ ఇండియా, టోక్యో 2020 ఒలింపిక్స్, ఐపీఎల్ 2021, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, దివాళీ ఫెస్టివల్, మాస్టర్ సినిమా, బిట్‌కాయిన్.. అన్నీ ఇండియాకు సంబంధించిన ట్రెండింగ్ టాపిక్స్. పర్మిషన్ టు డ్యాన్స్ అనేది మాత్రం సౌత్‌కొరియాకు చెందిన ఓ సాంగ్. ఆ పాట.. సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపింది. అది ఇండియన్స్‌కు కూడా తెగ నచ్చడంతో ఆ హ్యాష్టాప్ టాప్‌లో నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
WhatsApp | 20 లక్షల ఇండియన్ వాట్సప్ అకౌంట్లు బ్యాన్.. మీది బ్యాన్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
జియో, ఎయిర్‌టెల్‌ను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.94 చెల్లిస్తే చాలు
Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా
ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

