Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా
30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా | కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవడం ఎంత ముఖ్యమో.. వ్యాక్సిన్ వేసున్నట్టు ధృవీకరించే సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యం. వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా
కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవడం ఎంత ముఖ్యమో.. వ్యాక్సిన్ వేసున్నట్టు ధృవీకరించే సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యం. వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. ఏవైనా ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాలన్నా.. ట్రెయిన్, విమాన ప్రయాణాల్లో కూడా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశారు. చివరకు బస్సుల్లో ప్రయాణించాలన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. అందుకే.. వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లు ఖచ్చితంగా తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వెంట ఉంచుకోవాల్సిందే.

అయితే.. కొందరికి తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. కోవిన్ అనే యాప్‌లో కానీ.. వెబ్‌సైట్‌కి వెళ్లి కానీ.. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌తో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ.. చాలామందికి వాటి మీద అవగాహన లేదు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిపికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కానీ.. అందరికీ ఈజీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా సర్టిఫికెట్‌ను అందుబాటులో తీసుకురావడం కోసం.. కేంద్ర ప్రభుత్వం వాట్సప్‌లో కేవలం 30 సెకన్లలో సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది.
దాని కోసం వాట్సప్‌లో మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్ పేరుతో చాట్‌బాట్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని కోసం 9013151515 అనే నెంబర్‌ను ముందు మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి.. ఆ ఫోన్ నెంబర్ వాట్సప్ చాట్‌ను ఓపెన్ చేసి.. సర్టిఫికెట్ అని మెసేజ్ పంపించండి. అయితే.. వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న నెంబర్ నుంచే వాట్సప్ మెసేజ్ పంపించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయగానే.. చాట్ బాక్స్‌లో డౌన్లోడ్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది రెండో ఆప్షన్‌గా ఉంటుంది. దీంతో 2 నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత.. డౌన్లోడ్ కోవిన్ సర్టిఫికెట్ ఆని మూడో ఆప్షన్ కనిపిస్తుంది. మళ్లీ 3 అని రిప్లయి ఇస్తే.. అప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Reproducing Robots | పిల్లలు కంటున్న రోబోలు.. షాకింగ్ విషయం చెప్పిన సైంటిస్టులు
ఒమిక్రాన్ భయం.. బూస్టర్ డోస్ వేసుకోవాలా? ఇది కరోనా కొత్త వేరియంట్ నుంచి రక్షిస్తుందా?
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్
PAN Card | పాన్ కార్డ్‌లో మీ ఫోటో లేదా సిగ్నేచర్ సులువుగా మార్చుకోవచ్చు.. ఇలా..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

