రోబోలు అనగానే బలమైన ఇనుప శరీరాలు, పట్టి పట్టి కదలడాలు మాత్రమే మన ఊహకు అందుతాయి. కానీ రోబోల్లో చాలా రకాలుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాటిలో అమెరికాకు చెందిన సైంటిస్టులో తయారు చేసిన జీనోబోట్లు కూడా ఒకటి. ఇవి ఇప్పుడు పునరుత్పత్తి కూడా చేస్తున్నాయట. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్, టఫ్స్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ ఇన్స్పైర్డ్ ఇంజినీరింగ్ విభాగం కలిసి ఈ జీనోబోట్లను తయారుచేశాయి. ఇవి ఒక మిల్లీమీటరు కన్నా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే గుంపులుగా కలిసి పనిచేయడం, తగిలిన దెబ్బలను నెమ్మదిగా నయం చేసుకోవడం వంటి లక్షణాలు ఈ జీనోబోట్లు కనబరిచినట్లు పరిశోధనల్లో తేలింది.
ఆఫ్రికాలో దొరికే ఒక కప్ప కణాల నుంచి వీటిని తయారు చేశారు. ఈ కప్పను శాస్త్రీయ పరిభాషలో జీనోపస్ లేవిస్ అంటారు. ఈ పేరు నుంచే జీనోబోట్స్ అనే పేరు వచ్చింది. ఈ జీనోబోట్ల పరిశోధన మెడికల్ రంగానికి ఎంతో మేలు చేస్తుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై టఫ్స్ యూనివర్సిటీకి చెందిన మైకేల్ లెవిన్ వివరణ ఇచ్చారు.
‘కప్పలు సాధారణంగా పునరుత్పత్తి జరిపే విధానం ఒకటి ఉంది. అయితే వాటి కణాలను వేరు చేసి, ఒక కొత్త వాతావరణంలో వాటిని ఉంచినప్పుడు అక్కడ కూడా అవి బతుకుతాయి. ఆ కొత్త వాతావరణంలో తిరగడమే కాదు, చివరకు పునరుత్పత్తి జరపడానికి కూడా మార్గాన్ని కనుక్కుంటాయి’ అని మైకేల్ వివరించారు.
ఈ జీనోబోట్లు వాటిని ఉంచిన పాత్రలో అటూ ఇటూ తిరుగుతూ తమలాగే ఉండే కణాలను సృష్టిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్కు చెందిన జోష్ బోన్గార్డ్ తెలియజేశారు. ఈ జీనోబోట్లకు సంబంధించిన పూర్తి అధ్యయనం వివరాలు.. ప్రముఖ జర్నల్ పీఎన్ఏఎస్లో ప్రచురితమైనంది.
Our third xenobots paper was published today in PNAS.
— Sam Kriegman (@Kriegmerica) November 29, 2021
In a nutshell: they can now self-replicate.
w/ @DougBlackiston, @drmichaellevin, @DoctorJosh
More info: https://t.co/ySLBHeaGlL pic.twitter.com/vTvS2E3PoG