జియో, ఎయిర్‌టెల్‌ను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.94 చెల్లిస్తే చాలు
జియో, ఎయిర్‌టెల్‌ను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ | కస్టమర్ల కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేటు టెలికాం సంస్థలు
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తన కస్టమర్ల కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేటు టెలికాం సంస్థలు.. టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. అయినా కూడా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం రూ.250 లోపు బెస్ట్ ప్లాన్స్‌ను అందిస్తోంది.

కేవలం రూ.94 చెల్లిస్తే చాలు.. 75 రోజుల వాలిడిటీతో 3 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. ఏ నెట్‌వర్క్‌కు అయినా 100 నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. రోమింగ్ కాల్స్‌కు అయితే నిమిషానికి 30 పైసలు కట్ అవుతాయి.
రూ.94 ప్లాన్‌తో పాటు.. రూ.88 వాయిస్ వోచర్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది. 198 ప్లాన్‌లో 50 రోజుల వాలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటాను ఉచితంగా అందిస్తారు. 2 జీబీ డేటా పూర్తయితే.. ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. 209 ప్లాన్‌లో అయితే 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది.
రూ. 97 ప్లాన్ ప్రకారం 18 రోజుల వాలిడిటీతో రోజూ 2 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అన్లిమిడెట్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రూ. 99 ప్లాన్‌లో 22 రోజుల వాలిడిటీతో అన్లిమిడెట్ వాయిస్ కాల్స్, 99 ఎస్ఎంఎస్, రింగ్టోన్స్ లభిస్తాయి. రూ.75 ప్లాన్‌తో 50 రోజుల వాలిడిటీ, 2 జీబీ డేటా, 100 నిమిషాల వాయిస్ కాల్స్, 50 రోజుల వరకు ఫ్రీ రింగ్‌టోన్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
రూ.247 ప్లాన్‌లో 50 జీబీ హైస్పీడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 30 రోజుల వరకు రింగ్టోన్స్ యాక్సెస్ ఉంటుంది. రూ.298 ప్లాన్‌లో 56 రోజుల వాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్.. 3జీ నెట్వర్క్ సర్వీస్‌నే ఉపయోగిస్తోంది. సెప్టెంబర్ 2022 వరకు 4జీ సర్వీసులను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు చేస్తోంది. అయితే.. బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చినా.. అటువంటిదేమీ లేదని.. కేంద్రం ఇటీవలే పార్లమెంట్లో స్పష్టత ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా
ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
WhatsApp Tips : వాట్సప్ ఆన్లైన్ స్టేటస్ ఎవ్వరికీ కనిపించకూడదా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోనే కారు కీ.. డిజిటల్ కీతోనే డ్రైవింగ్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

