స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు వాట్సప్‌ను ఉపయోగిస్తారు. అన్నం తినకుండా అయినా ఉంటారేమో కానీ.. వాట్సప్ లేకుండా ఉండలేరు. ఈరోజుల్లో సింపుల్‌గా కమ్యూనికేట్ చేసుకోవడానికి వాట్సప్ ఉంటే చాలు. ఫోన్లో కొంచెం డేటా ఉంటే చాలు. మెసేజ్‌లతో పాటు ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ పంపించుకోవచ్చు. ఆడియో కాల్, వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. అందుకే.. వాట్సప్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతోంది.
అయితే.. వాట్సప్‌లో ఉండే ఒక్క ఫీచర్ ద్వారా మాత్రం చాలామంది తమకు ప్రైవసీకి భంగం కలుగుతోందని అంటుంటారు. అదే లాస్ట్ సీన్ ఫీచర్. వాట్సప్‌ను మీరు చివరిసారి ఎప్పుడు ఓపెన్ చేశారో.. మీ కాంటాక్ట్స్‌కు చెప్పేస్తుంది ఆ ఫీచర్. అది ఒక విధంగా ప్రైవసీకి భంగం వాటిల్లడమే. అయితే.. లాస్ట్ సీన్ కనిపించకుండా వాట్సప్‌లో సెట్టింగ్స్‌లో సెట్ చేసుకోవచ్చు. కానీ.. దాని వల్ల.. ఇతరుల లాస్ట్ సీన్ కూడా కనిపించదు.
అందుకే.. సింపుల్‌గా ఈ ట్రిక్‌తో వాట్సప్ లాస్ట్ సీన్ ఇతరులకు కనిపించకుండా.. ఆన్లైన్లో లేనట్టుగా.. వాళ్ల లాస్ట్ సీన్ మాత్రం మనకు కనపించేలా చేసుకోవచ్చు.
దాని కోసం చేయాల్సింది ఏంటంటే.. స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. మెసేజ్ నోటిఫికేషన్స్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం ముందు వాట్సప్ యాప్‌లోని వెళ్లి నోటిఫికేషన్స్ ట్యాబ్‌ను ఓపెన్ చేసి దాన్ని ఆన్ చేయాలి. ఆన్ చేశాక.. వాట్సప్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తే.. ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ప్యానెల్లో ఆ మెసేజ్ కనిపిస్తుంది. అక్కడే వాట్సప్ ఓపెన్ చేయకుండానే ఆ మెసేజ్‌కు రిప్లయి ఇవ్వొచ్చు. అక్కడ రిప్లయి అనే ఆప్షన్‌ను ఉపయోగించి మెసేజ్ పంపించుకోవచ్చు.
అది ఒకరకంగా టెక్స్ట్ మెసేజ్ లాంటిది. కానీ.. వాట్సప్ కాంటాక్ట్‌కు చేరుతుంది. మీరు రిప్లయి ఇచ్చినా కూడా వాట్సప్‌లో మీ ఆన్లైన్ స్టేటస్ కనిపించదు. లాస్ట్ సీన్ ఇతరులకు కనిపించదు. ఎందుకంటే నోటిఫికేషన్ ప్యానెల్ ఉపయోగించి మీరు మెసేజ్ పంపిస్తారు కాబట్టి.. వాట్సప్ ఓపెన్ చేయరు కాబట్టి.. మీ ప్రైవసీకి ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే వాట్సప్ యాప్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ ట్యాబ్‌ను ఆన్ చేసుకోండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోనే కారు కీ.. డిజిటల్ కీతోనే డ్రైవింగ్
Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా
Uber Cab : ఇక నుంచి వాట్సప్‌లోనూ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి