Uber Cab : ఇక నుంచి వాట్సప్‌లోనూ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
ఇక నుంచి వాట్సప్‌లోనూ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు | ల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉండాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడే సంఖ్య తగ్గింది. సొంత వాహనాలు ఉన్నవాళ్లు
ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉండాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడే సంఖ్య తగ్గింది. సొంత వాహనాలు ఉన్నవాళ్లు అయితే తమ వాహనాల్లో వెళ్లిపోతారు. సొంత కారు లేనివాళ్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకపోతే.. వాళ్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆటో లేదంటే క్యాబ్.

ఇదివరకు అంటే రోడ్డు మీదికి వచ్చి క్యాబ్ కోసం ఎదురు చూసేవాళ్లు. కానీ.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో బుక్ చేస్తే.. ఇంటికే క్యాబ్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఉబెర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులు చాలానే ఉన్నాయి.
అయితే.. ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకోవాలంటే ఇక నుంచి ఉబెర్ యాప్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ద్వారా కూడా ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. దాని కోసమే వాట్సప్ చాట్‌బాట్ అనే సరికొత్త ఫెసిలిటీని ప్రారంభించింది.
ఇండియాలో ఈ ఫీచర్ తొలిసారి లక్నోలో అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్‌బాట్ ఫీచర్ కేవలం ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అన్ని రీజనల్ భాషల్లో చాట్‌బాట్‌ను డెవలప్ చేయనున్నారు. అలాగే.. లక్నో తర్వాత మిగితా అన్ని మెట్రో సిటీలలో ఈ ఫెసిలిటీని త్వరలోనే వాట్సప్ అందుబాటులోకి తీసుకురానుంది.
ఉబెర్ బిజినెస్ అకౌంట్ నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. దాని కోసం ఉబెర్ సంస్థ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. డైరెక్ట్‌గా ఉబెర్ వాట్సప్ చాట్ ఓపెన్ అవుతుంది. అందులో పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫేర్, కారు డ్రైవర్ సమాచారాన్ని చాట్‌బాట్ అందిస్తుంది.
ఉబెర్ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండానే ఈ ఆప్షన్ ద్వారా వాట్సప్ ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఉబెర్ యాప్‌లో ఏ ఫెసిలిటీలు ఉంటాయో.. ఈ వాట్సప్ చాట్బాట్లో కూడా అన్ని ఫెసిలిటీలు ఉంటాయని ఉబెర్ సంస్థ వెల్లడించింది. డ్రైవర్ వివరాలు, కారు నెంబర్, లొకేషన్ ట్రాకింగ్ అన్ని వివరాలను చాట్బాట్లో కూడా తెలుసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iPhone SE 2022 : 5జీ కనెక్టివిటీతో ఐఫోన్ ఎస్ఈ.. లాంచ్ ఎప్పుడంటే?
Reproducing Robots | పిల్లలు కంటున్న రోబోలు.. షాకింగ్ విషయం చెప్పిన సైంటిస్టులు
Twitter CEO Salary | ట్విట్టర్ న్యూ సీఈవో వేతనం ఎంతంటే..!
Samsung Galaxy : శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఎస్22+ కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్!
Redmi : రెడ్మి నోట్ 11టీ ఇండియా లాంఛ్!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

