సియోల్ : వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌ను లాంఛ్ చేయాలని శాంసంగ్ సన్నద్ధమవుతుండగా గెలాక్సీ ఎస్22, ఎస్22+ కెమెరా స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి. ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన ఎస్21 సిరీస్ తరహాలోనే గెలాక్సీ ఎస్22, ఎస్22+ స్మార్ట్పోన్లు రెండువైపులా ఐడెంటికల్ కెమెరా హార్డ్‌వేర్‌ను కలిగిఉంటాయని టెక్ నిపుణులు పేర్కొన్నట్టు గిజ్మోచైనా వెల్లడించింది.
ఈ ఫోన్లు 3x ఆప్టికల్ జూమ్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానున్నాయని ఈ రిపోర్ట్ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లు వచ్చే ఏడాది జనవరి నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్‌లోని మోడల్స్ అన్నీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 చిప్సెట్తో రానున్నాయి.