ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోనే కారు కీ.. డిజిటల్ కీతోనే డ్రైవింగ్
ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోనే కారు కీ | ఇదంతా టెక్నాలజీ యుగం. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాం.
ఇదంతా టెక్నాలజీ యుగం. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాం. ఇంట్లో కూర్చొని అన్ని పనులు చక్కదిద్దుతున్నామంటే దానికి కారణం టెక్నాలజీ. ఇంకా ఈజీగా పనులను చేసుకోవడం కోసం.. మరింత సులభతరం చేసుకునేందుకు గూగుల్.. తన మొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్‌లో త్వరలో సరికొత్త అప్డేట్స్ను తీసుకురానుంది.

దానిలో ప్రధానమైనవి డిజిటల్ కారు కీ ఫీచర్, ఫ్యామిలీ బెల్, గూగుల్ ఫోటోస్. ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్లను గూగుల్ తీసుకొస్తున్నట్టు బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.
ఫ్యామిలీ బెల్ – Family Bell
ఫ్యామిలీ బెల్ అనే ఫీచర్.. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిపేది. ప్రస్తుతం అందరూ బిజీ బిజీ జీవితాలను గడుపుతుంటారు. అటువంటి వాళ్లు రోజులో కొంత సమయాన్ని తమ ఫ్యామిలీ కోసం కేటాయిస్తారు. అటువంటి వాళ్లకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. రోజులో ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకొని.. అదే టైమ్‌ను అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లలోకి అలర్ట్‌గా పంపించుకోవచ్చు. ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా నోటిఫికేషన్లా పంపించుకోవచ్చు. దాని ద్వారా వేరే పనుల్లో ఉన్నవాళ్లంతా ఒక్కచోటుకు చేరి ఫ్యామిలీ అంతా సమయాన్ని వెచ్చించుకోవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం అయినా.. హాలిడే రోజు ఎటైనా బయటికి వెళ్లాలనుకున్నా.. లంచ్, లేదా ఈవెనింగ్ చిట్‌చాట్ కోసం.. ఇలా పలు రకాలుగా ఫ్యామిలీతో గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకోవడానికి ఫ్యామిలీ బెల్ ఫీచర్‌ను ఉపయోగించుకోచ్చు.

గూగుల్ ఫోటోస్ – Google Photos
ఈ ఫీచర్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలను తిరిగి గుర్తు తెచ్చుకోవచ్చు. ఏదైనా స్పెషల్ అకేషన్‌కు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ అకేషన్లో దిగిన ఫోటోలను గూగుల్ ఫోటోస్‌లో షేర్ చేసుకొని.. తిరిగి ఎప్పుడైనా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

డిజిటల్ కారు కీ ఫీచర్ – Digital Car Key Feature
గూగుల్ నుంచి వస్తున్న మరో బ్రహ్మాండమైన ఫీచర్ డిజిటల్ కారు కీ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు.. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా.. కారు కీ లేకున్నా.. కారును డిజిటల్ కీ ఉపయోగించి లాక్ వేసుకోవచ్చు. అన్‌లాక్ చేయొచ్చు. కారును స్టార్ట్ కూడా చేయొచ్చు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మాత్రమే లాంచ్ చేయనుంది గూగుల్. అలాగే.. గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, సామ్సంగ్ గెలాక్సీ ఎస్21 లాంటి ఫోన్లలో బీఎండబ్ల్యూ కార్ల కోసం ఈ ఫీచర్‌ను తీసుకురానుంది. ఆ తర్వాత ఈ ఫీచర్‌ను అన్ని ఫోన్లలోనూ, అన్ని కార్లలోనూ తీసుకురానుంది.
ఇప్పటికే డిజిటల్ కారు కీ ఫీచర్‌ను యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం తీసుకొచ్చింది. కాకపోతే యాపిల్ కూడా కొన్ని లగ్జరీ కార్లకే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిజిటల్ కారు కీ ఫీచర్‌తో పాటు.. ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్‌ను కార్ల కోసం తీసుకురానుంది. దీని ద్వారా.. కారుతో ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఆటోమెటిక్‌గా కనెక్ట్ చేసుకుంటుంది. గూగుల్ అసిస్టెంట్‌తో డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే.. జీబోర్డ్‌లో పలు కొత్త ఎమోజీలను తీసుకురానుంది. లేటెస్ట్ స్టికర్లను తీసుకురానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Uber Cab : ఇక నుంచి వాట్సప్‌లోనూ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
iPhone SE 2022 : 5జీ కనెక్టివిటీతో ఐఫోన్ ఎస్ఈ.. లాంచ్ ఎప్పుడంటే?
Reproducing Robots | పిల్లలు కంటున్న రోబోలు.. షాకింగ్ విషయం చెప్పిన సైంటిస్టులు
Twitter CEO Salary | ట్విట్టర్ న్యూ సీఈవో వేతనం ఎంతంటే..!
Samsung Galaxy : శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఎస్22+ కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

