ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి | ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకంలో లబ్ధి పొందాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.
ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకంలో లబ్ధి పొందాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. చివరకు రేషన్ బియ్యం తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితేనే రేషన్ బియ్యం ఇస్తారు. లేదంటే.. రేషన్ బియ్యం కూడా రావు. మన జీవితంలో ఆధార్ కార్డు ఇప్పుడు చాలా ప్రధానమైనది. ఆధార్ కార్డు లేకుంటే చివరకు ఒక సిమ్ కార్డు కూడా తీసుకోలేం.

నిజానికి.. ఆధార్ కార్డుతో ఖచ్చితంగా మొబైల్ నెంబర్‌ను కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. పలు పథకాలకు అర్హులు కారు. ఈపీఎఫ్ దగ్గర్నుంచి.. ప్రభుత్వం కార్యాలయాల్లో తీసుకునే ప్రతి డాక్యుమెంట్ కోసం ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌కు లింక్ చేసుకోవాల్సిందే.
చాలామందికి తమ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో తెలియదు. అలాగే.. ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో కూడా కొందరికి తెలియదు.
అటువంటి వాళ్లు ఆన్లైన్లో తమ ఆధార్ కార్డు.. మొబైల్ నెంబర్‌కు లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. లింక్ అయితే ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు.
ఎలా చెక్ చేసుకోవాలి?
దాని కోసం ముందుగా ఆధార్ అఫిషియల్ వెబ్సైట్ https://uidai.gov.in/ కు వెళ్లి పైన మెనూలో ఉన్న మై ఆధార్( MyAadhaar) సెక్షన్లోకి వెళ్లండి. కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో verify my email/ mobile number అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

దాని మీద క్లిక్ చేయగానే వేరే పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, క్యాప్చా డిటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ అప్పటికే మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే.. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఈ ఆధార్‌తో లింక్ అయి ఉంది.. అనే మెసేజ్ వస్తుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ మ్యాచ్ కాకపోతే.. వెంటనే దగ్గర్లోకి ఆధార్ సెంటర్‌కు వెళ్లి మొబైల్ నెంబర్‌ను అప్డేట్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
WhatsApp Tips : వాట్సప్ ఆన్లైన్ స్టేటస్ ఎవ్వరికీ కనిపించకూడదా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోనే కారు కీ.. డిజిటల్ కీతోనే డ్రైవింగ్
Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా
Uber Cab : ఇక నుంచి వాట్సప్‌లోనూ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

