మీకు వెబ్సైట్ ఉందా. మీ కంపెనీ ఆపరేషన్స్ కోసం.. కంపెనీ ప్రమోషన్స్ కోసం.. వెబ్‌సైట్‌ను వాడుతున్నారా? మీది న్యూస్ వెబ్‌సైటా? కంటెంట్ బేస్డ్ వెబ్‌సైటా? ఏ వెబ్సైట్ అయినా అందరూ ముందు ఆ వెబ్సైట్ అలెక్సా ర్యాంక్ ఎంత అని అడుగుతారు. అలెక్సా గ్లోబల్ ర్యాంక్ ఎంత? అలెక్సా ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతారు. ఏవైనా ప్రైవేట్ యాడ్స్ కంపెనీలు వెబ్సైట్లలో తమ యాడ్స్ అడ్వర్టైజ్ చేయాలన్నా అలెక్సా ర్యాంక్‌నే ప్రామాణికంగా తీసుకుంటాయి. అలెక్సా ఇండియా ర్యాంకు ఎంత తక్కువగా ఉంటే.. ఆ సైట్ బెస్ట్ సైట్ అని కొందరు నమ్ముతుంటారు.
ఇప్పటి వరకు ఒక వెబ్‌సైట్‌ను అంచనా వేయడానికి అలెక్సా ర్యాంక్‌ను చూసి తెలుసుకున్నాం. కానీ.. ఇక ముందు వెబ్‌సైట్‌ను అంచనా వేయడానికి.. అలెక్సా ర్యాంకు ఉండదు. అవును.. వచ్చే సంవత్సరం మే 2022లో అలెక్సా వెబ్సైట్ ర్యాంకింగ్ సర్వీస్‌ను అమెజాన్ సంస్థ షట్‌డౌన్ చేసేస్తోంది. అలెక్సా ఇంటర్నెట్ను అమెజాన్ ఏప్రిల్ 1996లో లాంచ్ చేసింది. అంటే సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మే 2022లో ఈ సర్వీస్‌ను అమెజాన్ షట్‌డౌన్ చేస్తోంది.
అలెక్సా.. వెబ్సైట్ ర్యాంకింగ్ సర్వీస్‌తో పాటు ఎస్ఈవో(SEO) రీసెర్చ్, అనాలిసిస్ టూల్స్‌ను అందిస్తోంది. అలెక్సా పెయిడ్ వర్షన్ తీసుకుంటే.. పలు రకాల ఎస్ఈవో సర్వీస్‌లను అలెక్సా అందిస్తుంది. కీవర్డ్ రీసెర్చ్, ట్రెండింగ్ కీవర్డ్స్, ఆర్గానిక్ రీచ్, సెర్చ్ ట్రాఫిక్, సిమిలర్ సైట్స్, ఓవర్లాప్ స్కోర్, బౌన్స్ రేట్, టాప్ సోషల్ టాపిక్స్, సోషల్ ఎంగేజ్మెంట్, ట్రాఫిక్ సోర్సెస్, రెఫరల్ సైట్స్, టాప్ కీవర్డ్స్, ఆడియెన్స్ ఓవర్లాప్, ఆడియెన్స్ జాగ్రఫీ, సైట్ మెట్రిక్స్, టాప్ లింక్డ్ సైట్స్ లాంటి ఫీచర్లను అలెక్సా అందిస్తుంది. దీన్ని బట్టి వెబ్సైట్ మెట్రిక్స్‌ను అంచనా వేసుకొని వెబ్‌సైట్‌ను ఇంప్రూవ్ చేసుకోవడానికి అలెక్సా ఎస్ఈవో పరంగా సహాయ పడుతుంది.
మే 2022 లో అలెక్సా వెబ్‌సైట్‌ను షట్‌డౌన్ చేశాక.. డిసెంబర్ 2022 లోపు అలెక్సా సర్వీస్ ఏపీఐని ఆపేస్తామని అమెజాన్ స్పష్టం చేసింది. అలెక్సా సర్వీస్ షట్‌డౌన్ అయ్యేలోపు… యూజర్లు తమ వెబ్సైట్ల డేటాను ఎక్స్పోర్ట్ చేసుకోవాలని.. తర్వాత డేటా అలెక్సా దగ్గర ఉండదని.. కంపెనీ స్పష్టం చేసింది.
డిసెంబర్ 8, 2021 నుంచే కొత్త సబ్‌స్క్రైబర్స్‌ను అలెక్సా ఇంటర్నెట్ చేర్చుకోవడం లేదు. ఇప్పటికే అలెక్సాకు సబ్‌స్క్రైబ్ చేసుకున్న కస్టమర్లు మాత్రం అలెక్సా షట్‌డౌన్ అయ్యేంతవరకు సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.
అలెక్సాను అమెజాన్ ఎందుకు షట్‌డౌన్ చేస్తోందో కారణం చెప్పనప్పటికీ.. గత కొన్నేళ్లుగా అలెక్సాకు వచ్చే సొంత ట్రాఫిక్ తగ్గుతున్నట్టుగా సర్వేలో తేలిందని ట్రాఫిక్, మార్కెటింగ్ అనాలిటిక్స సంస్థ సెమ్రష్(Semrush) స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp | 20 లక్షల ఇండియన్ వాట్సప్ అకౌంట్లు బ్యాన్.. మీది బ్యాన్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
జియో, ఎయిర్‌టెల్‌ను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.94 చెల్లిస్తే చాలు
Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా
ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
WhatsApp Tips : వాట్సప్ ఆన్లైన్ స్టేటస్ ఎవ్వరికీ కనిపించకూడదా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు