Bipin Rawat | తండ్రి బాటలో సైన్యంలోకి.. ట్రబుల్ షూటర్‌గా దేశానికి సేవ
Bipin Rawat biography | సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిందా.. ఆయన రంగంలోకి దిగాల్సిందే. బోర్డర్లో ఎలాంటి పరిస్థితిని అయినా చక్కదిద్దే సత్తా ఆయనది. సరిహద్దు దేశాలతో సమస్యలకు ఆయన ఓ ట్రబుల్ షూటర్. ఆయనే త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్. చిన్నతనం నుంచి తండ్రిని చూస్తూ సైన్యంపై మక్కువ పెంచుకున్న బిపిన్.. ఆయన బాటలోనే సైన్యంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తొలి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బాధ్యతలు స్వీకరించారు. అలాంటి వ్యక్తి బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆర్మీ కమాండ్‌పై అమెరికాలో కోర్సు
ఉత్తరాఖండ్‌లోని పౌరీలో 1958లో బిపిన్ రావత్ జన్మించారు. వారిది రాజ్‌పుత్ కుటుంబం. బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్.. భారత ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైర్ అయ్యారు. చిన్నతనం నుంచి తండ్రిని చూస్తూ సైన్యంపై బిపిన్ రావత్ మక్కువ పెంచుకున్నారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్లో పాఠశాల విద్య తర్వాత విల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని కాన్సాస్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజిలో హైయ్యర్ కోర్స్ పూర్తి చేశారు. దేవీ అహల్య యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమా చేశారు. 2011లో మీరట్‌లోని ఛౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి మిలటరీ మీడియా అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
తండ్రి బాటలోనే ఆర్మీలోకి..
1978లో ఆర్మీలో బిపిన్ రావత్ తన కెరీర్‌ను మొదలుపెట్టారు. తొలిసారిగా ఎలెవన్ గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఐదో బెటాలియన్‌లో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేరారు. బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ రావత్ కూడా ఇదే యూనిట్లో కెరీర్‌ను ప్రారంభించడం విశేషం. ఇక్కడ ఆయన అందించిన సేవలకు గానూ స్వోర్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. అనంతరం వివిధ హోదాల్లో పనిచేస్తూ చివరకు త్రివిధ దళాధిపతి స్థాయికి చేరుకున్నారు. గూర్ఖా రైఫిల్స్ తర్వాత ఉరిలో మేజర్‌గా.. జమ్ముకశ్మీర్‌లో కంపెనీ కమాండ్‌గా వ్యవహరించారు. అనంతరం గూర్ఖా రైఫిల్స్‌లో కల్నల్‌గా కూడా పనిచేశారు. దాని తర్వాత జమ్ముకశ్మీర్‌లోని సోపూర్లో రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టర్ 5లో బాధ్యతలు నిర్వర్తించారు. ఐరాస మెషిన్లో భాగంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పనిచేశారు. ఇక్కడ ఆయనకు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ కమెండేషన్లు లభించాయి. ఆ తర్వాత ఉరిలో జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నాగాలాండ్‌లోని టైగర్ కోర్లో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేశారు. 2017 జనవరి 1న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, మోలోని ఆర్మీ వార్ కాలేజీలో శిక్షకుడిగా కూడా పనిచేశారు.
సరిహద్దులో దూకుడుగా..
బిపిన్ రావత్ తన కెరీర్లో ఎంత దూకుడుగా వ్యవహరించారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులు, శత్రుదేశాలకు జరిపిన ఆపరేషన్లను సమర్థంగా నిర్వర్తించారు. 1962లో చైనాతో యుద్దం తర్వాత తొలిసారిగా మెక్‌మొహన్ రేఖ వద్ద 1987లో ఘర్షణలు చెలరేగాయి. ఆ సమయంలో బిపిన్ రావత్ తన టీమ్‌తో కలిసి చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంది. 2015లో యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ మిలిటెంట్లు.. మయన్మార్‌లోకి చొరబడి 18 మంది భారత జవాన్లను హత్య చేశారు. ఆ సమయంలో బిపిన్ రావత్ ధింపూర్‌లో టైగర్ కోర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలియగానే 21 పారా కమాండోల సాయంతో ఒక ఆపరేషన్ చేపట్టి.. మయన్మార్‌లోకి చొరబడ్డ మిలిటెంట్లను హతమార్చారు.
తొలి త్రివిధ దళాధిపతి
ప్రస్తుతం భారత్‌లో ఉన్న అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్. ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించడంలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. తన కెరీర్లో సరిహద్దుల వద్ద జరిగిన ఘర్షణలు ఎన్నింటినో ఆయన చాకచక్యంగా పరిష్కరించారు. ఆ అనుభవం కారణంగానే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల అధిపతిగా నియమించారు. భారత్‌కు తొలి సీడీఎస్ ఆయనే. లఢాఖ్ సంక్షోభ సమయంలో త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి మధ్య ఆయన వారథిలా పనిచేశారు. భారత రక్షణ రంగంలో అతి పెద్ద సంస్కరణలకు ఆయనే మార్గదర్శి.
కెరీర్లో ఎన్నో మెడల్స్
సుదీర్ఘకాలంపాటు ఆర్మీలో సేవలందించిన బిపిన్ రావత్ పలు పతకాలను అందుకున్నారు. ఉత్తమ యుద్ధ సేవా పతకం (యూవైఎస్ఎమ్), అతి విశిష్ట సేవా పతకం (ఏవీఎస్ఎం), యుద్ధ సేవా పతకం (వైఎస్ఎం), సేన మెడల్ (ఎస్ఎం), విశిష్ట సేవా మెడల్ (వీఎస్ఎం), చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) కమెండేషన్ తదితర పతకాలు అందుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
CDS BipinRawat | రావత్ భార్య మధులిక మృతి.. ముద్దముద్దలుగా మృతదేహాలు
Bipin Rawat | బిపిన్ రావత్ కంటే ముందు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ప్రముఖులు వీరే..
Bipin Rawat | బిపిన్ రావత్ మరణానికి ముందు ఏం జరిగింది..?
Bipin Rawat death | గతంలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ రావత్
IAF Helicopter crash: కాలిపోతున్న హెలిక్యాప్టర్ నుంచి మృతదేహాలు పడటం చూశా..!
Bipin Rawat | బిపిన్ రావత్ కూనూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..?
IAF Helicopter crash | తునాతునకలైన హెలికాప్టర్.. కాలిబూడిదైన భారీ వృక్షాలు.. వీడియో
CDS Bipin Rawat | జీవాయుధ యుద్ధం గురించి నిన్ననే వార్నింగ్ ఇచ్చిన బిపిన్ రావత్..
IAF chopper crash | వెదర్ బ్రీఫింగ్ తర్వాతే ఎగిరిన రావత్ హెలికాప్టర్ !
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

