Bipin Rawat | బిపిన్ రావత్ కూనూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..?
Bipin Rawat | తమిళనాడు నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగింది? అసలు ఢిల్లీ నుంచి కూనూరుకు బిపిన్ రావత్ ఎందుకు బయల్దేరారు? అనే విషయాలను

Bipin Rawat dead : తమిళనాడు నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగింది? అసలు ఢిల్లీ నుంచి కూనూరుకు బిపిన్ రావత్ ఎందుకు బయల్దేరారు? అనే విషయాలను తెలుసుకుందాం..
బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి డిఫెన్స్ విమానంలో కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌బేస్‌కు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 9 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. సూలూరు ఎయిర్‌బేస్ నుంచి కూనూరు కంటోన్మెంట్‌కు ఆర్మీ హెలికాప్టర్లో బిపిన్ రావత్ దంపతులతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. ఇక కూనూరు ఎయిర్‌బేస్‌లో మరో 5 నిమిషాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే కంటే ముందే చాపర్ కుప్పకూలిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా మధ్యాహ్నం 1:50కి ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలిపింది.
కూనూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..?
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కూనూరు కంటోన్మెంట్‌కు ఎందుకు వెళ్లారంటే.. అక్కడున్న ఆర్మీ రీసెర్చ్ కేంద్రంలో ప్రసంగించాల్సి ఉండటంతో వెళ్లారు. ఈ కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. ఆ కంటోన్మెంట్ ఏరియాకు చేరుకునే క్రమంలోనే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రమాదమా? విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
CDS BipinRawat | రావత్ భార్య మధులిక మృతి.. ముద్దముద్దలుగా మృతదేహాలు
Bipin Rawat | గతంలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ రావత్
IAF Helicopter crash: కాలిపోతున్న హెలిక్యాప్టర్ నుంచి మృతదేహాలు పడటం చూశా..!
Bipin Rawat | బిపిన్ రావత్ కూనూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..?
IAF Helicopter crash | తునాతునకలైన హెలికాప్టర్.. కాలిబూడిదైన భారీ వృక్షాలు.. వీడియో
CDS Bipin Rawat | జీవాయుధ యుద్ధం గురించి నిన్ననే వార్నింగ్ ఇచ్చిన బిపిన్ రావత్..
IAF chopper crash | వెదర్ బ్రీఫింగ్ తర్వాతే ఎగిరిన రావత్ హెలికాప్టర్ !
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

