CDS Bipin Rawat wife Madhulika Rawat : తమిళనాడు నీలగిరి కొండల్లో కుప్పకూలిన హెలికాప్టర్ ప్రమాద ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికా రావత్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్టర్లో మొత్తం 14 మంది ప్రయాణించగా, 13 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన ఒకరు 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని సమాచారం. తమిళనాడులోని కోయంబత్తూరు – కూనూరు మధ్య హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే.
ఘటనాస్థలిలో మృతదేహాలు ముద్దముద్దలుగా మారిపోయాయి. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు మాడిమసైపోయాయి. డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను కూనూరు ఎయిర్‌బేస్‌లోని వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో రావత్‌కు ముగ్గురు డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CDS BipinRawat | రావత్ భార్య మధులిక మృతి.. ముద్దముద్దలుగా మృతదేహాలు
Bipin Rawat | గతంలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ రావత్
IAF Helicopter crash: కాలిపోతున్న హెలిక్యాప్టర్ నుంచి మృతదేహాలు పడటం చూశా..!
Bipin Rawat | బిపిన్ రావత్ కూనూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..?
IAF Helicopter crash | తునాతునకలైన హెలికాప్టర్.. కాలిబూడిదైన భారీ వృక్షాలు.. వీడియో
CDS Bipin Rawat | జీవాయుధ యుద్ధం గురించి నిన్ననే వార్నింగ్ ఇచ్చిన బిపిన్ రావత్..
IAF chopper crash | వెదర్ బ్రీఫింగ్ తర్వాతే ఎగిరిన రావత్ హెలికాప్టర్ !