బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. ఎట్టకేలకు ఇవాళ ఓ ఇంటివారయ్యారు. రాజస్థాన్‌లో ఈ జంట పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను తాజాగా విక్కీ కౌశల్ తన ఇన్‌స్టా అకౌంట్లో తన అభిమానులతో పంచుకున్నాడు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కత్రినా, విక్కీ పెళ్లికి హాజరై వాళ్లను ఆశీర్వదించారు.
కట్ చేస్తే.. ప్రముఖ కండోమ్ బ్రాండ్ డ్యురెక్స్.. కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లిపై ఓ మీమ్ క్రియేట్ చేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. డబుల్ మీనింగ్‌తో ఆ మీమ్ ఉండటంతో నెటిజన్లు అయితే ఆ మీమ్‌ను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సూపర్బ్ క్రియేటివిటీ.. అంటూ ఆ మీమ్‌ను వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ మీమ్‌లో ఏముంది అంటారా? డియర్ విక్కీ, కత్రినా.. మీ పెళ్లికి మమ్మల్ని పిలవకపోతే.. మీరు ఆటపట్టిస్తున్నట్టు అనుకోవాలా అంటూ ఇంగ్లీష్‌లో కిడ్డింగ్ అని రాసి ఉంది. Kidding అనే వర్డ్‌ను బోల్డ్ లెటర్స్‌లో రాయడంతో నెటిజన్లు.. వెంటనే అది డబుల్ మీనింగ్ వర్డ్ అని అర్థం చేసుకున్నారు. అంటే.. మా బ్రాండ్ కండోమ్‌తో మీకు పనిలేదు అంటే.. మీరు పిల్లలను కనే పనిలో పడ్డారు అని అర్థం అనే మీనింగ్ వచ్చేలా మీమ్‌ను తయారు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చెరుకు రసం నుంచి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఈ వీడియో చూసి తెలుసుకోండి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఇవే