బెల్లం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాసింత బెల్లం నోట్లో వేసుకుంటే చాలు.. నోరంతా తియ్యగా అవుతుంది. అయితే.. బెల్లాన్ని దేని నుంచి తయారు చేస్తారు అంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం.. చెరుకు రసం నుంచి అని. మరి.. చెరుకు రసం నుంచి బెల్లాన్ని తయారు చేయడానికి ప్రాసెస్ ఏంటి? దాని కోసం ఎటువంటి యంత్రాలను వాడుతారు. అసలు.. తెల్లగా ఉండే చెరుకు రసం నుంచి వేరే రంగులోకి మారి బెల్లం ఎలా తయారు అవుతుంది అనే డౌట్లు చాలామందికి వస్తాయి.
అందుకే.. ఓ ఫుడ్ బ్లాగర్.. చెరుకు రసం నుంచి బెల్లాన్ని తయారు చేసే ఓ ఫ్యాక్టరీకి వెళ్లి.. అక్కడ బెల్లాన్ని ఎలా తయారు చేస్తున్నారో.. వీడియో తీసి తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా బెల్లాన్ని ఎలా తయారు చేస్తున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్టాగ్స్ ఇవే