డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ మరణాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిస్వార్థంగా దేశానికి కొన్ని దశాబ్దాల పాటు సేవ చేసి.. ఇలా అకస్మాత్తుగా ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో దేశమంతా ఒక్కసారిగా మూగవోయింది.
దేశ ప్రజలంతా ఆయనకు ఘన నివాళలు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన్ను దేశం ఎప్పటికీ మరిచిపోదని.. ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు.
ఈనేపథ్యంలో బిపిన్ రావత్‌కు ఘనంగా నివాళి అర్పించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక ఆకుతో బిపిన్ రావత్ బొమ్మను తయారు చేసి.. ఆయనకు ఘనమైన వీడ్కోలు పలికారు. ఆ వీడియోను చాలా మంది ప్రముఖులు షేర్ చేసి ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రావత్ అంత్యక్రియల్లో 17 సార్లు గన్ సెల్యూట్
బిపిన్ రావత్ అమర్ రహే.. అంతిమయాత్రలో జననీరాజనం
General Bipin rawat: బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించిన త్రివిధ దళాల అధిపతులు