21 ఏళ్ల క్రితం మిస్ అయిన ఇద్దరు టీనేజర్ల కేసును ప్రాణాలకు తెగించి ఛేదించిన యూట్యూబర్..
టీనేజర్ల కేసును ప్రాణాలకు తెగించి ఛేదించిన యూట్యూబర్ | అది ఏప్రిల్ 3, 2000. అంటే 21 ఏళ్ల కింద.. 18 ఏళ్ల ఎరిన్ ఫోస్టర్ అనే యువతి, 17 ఏళ్ల జెరెమీ బెచ్‌టెల్ అనే కుర్రాడు.. ఇద్దరూ ఒక పార్టీకి వెళ్లారు. ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వారు
అది ఏప్రిల్ 3, 2000. అంటే 21 ఏళ్ల కింద.. 18 ఏళ్ల ఎరిన్ ఫోస్టర్ అనే యువతి, 17 ఏళ్ల జెరెమీ బెచ్‌టెల్ అనే కుర్రాడు.. ఇద్దరూ ఒక పార్టీకి వెళ్లారు. ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వారు. రాత్రి 10 గంటల వరకు పార్టీలో సరదాగా గడిపారు. ఆ తర్వాత ఫోస్టర్ కారులో ఇంటికి బయలుదేరారు. పార్టీ అయిపోయాక కారులో ఇంటికి అయితే బయలుదేరారు కానీ.. వాళ్లు ఇంటికి మాత్రం చేరలేదు. రాత్రి 11 అయింది.. 12 అయింది.. 1 అయింది అయినా ఇంకా పిల్లలు రాలేదని ఇంటి వద్ద తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ.. ఎక్కడా వాళ్ల గురించి సమాచారం దొరకలేదు. పోలీసులు కూడా చాలా రోజుల పాటు వెతికారు కానీ.. వాళ్ల కారు గురించి కానీ.. మిస్ అయిన ఇద్దరు టీనేజర్ల గురించి కానీ.. ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో పోలీసులు కూడా ఆ కేసును క్లోజ్ చేసేశారు. ఈ ఘటన యూఎస్‌లోని టెన్నెస్సేలో చోటు చేసుకుంది.

కట్ చేస్తే.. 21 ఏళ్ల తర్వాత.. ఆ టీనేజర్ల మిస్సింగ్ మిస్టరీని ఓ యూట్యూబర్ ఛేదించాడు.42 ఏళ్ల జెరెమీ సైడెస్కు ఓ యూట్యూబ్ చానెల్ ఉంది. దాని పేరు Exploring with Nug. ఆ చానెల్ కోసం జెరెమీ పలు అడ్వెంచర్లు చేస్తుంటాడు. ఈ మధ్య.. 21 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆ ఇద్దరు టీనేజర్ల గురించి జెరెమీకి తెలిసింది.
దీంతో పోలీసుల దగ్గర్నుంచి సమాచారం మొత్తం సేకరించి.. వాళ్లను వెతికే పనిలో పడ్డాడు. వాళ్లను వెతుకుతూ.. వీడియోను కూడా షూట్ చేశాడు. వాళ్ల కారు సమీపంలో ఉన్న చెరువు, కాలువలో పడి ఉంటుందని అనుమానించి.. తన దగ్గర ఉన్న సోనార్ పరికరంతో అక్కడ ఉన్న అన్ని చెరువుల్లో గాలింపు ప్రారంభించాడు.
చివరకు కాల్ఫ్కిల్లర్ అనే నదిలో ఓ కారు మునిగిపోయి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. స్కూబా డైవింగ్ చేసి.. కారు దగ్గరికి వెళ్లి.. ఆ కారు ఆనవాళ్లను చెక్ చేశాడు. కారు మోడల్, కారు నెంబర్ ఒకసారి చెక్ చేసుకొని.. మునిగిపోయిన కారు.. 21 ఏళ్ల క్రితం మిస్ అయిన కారే అని కన్ఫమ్ చేసుకున్నాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. భారీ క్రేన్ సాయంతో ఆ కారును నీళ్లలో నుంచి బయటికి తీశారు. తాను చేసిన ఈ సాహసాన్ని మొత్తం వీడియో తీసి.. తన యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేశాడు జెరెమీ. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ప్రాణాలకు తెగించి మిస్సింగ్ కేసును ఛేదించిన ఆ యూట్యూబర్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అప్పుడు చనిపోవాలనుకున్నాడు.. తన మెమోరీ పవర్‌తో ఇప్పుడు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు
Harnaaz sandhu | మిస్ యూనివర్స్ అందాల పోటీలకు భారత్ నుంచి హర్నజ్ సంధు.. ఈ పంజాబీ గర్ల్ విశేషాలు
OTT | 2008లోనే భారత్‌లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో లాభమా? నష్టమా?
HING LAJ TEMPLE | పాకిస్తాన్లో ముస్లింలు సైతం తల వంచే దేవాలయం విశిష్టత గురించి మీకు తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

