Harnaaz sandhu | మిస్ యూనివర్స్ అందాల పోటీలకు భారత్ నుంచి హర్నజ్ సంధు.. ఈ పంజాబీ గర్ల్ విశేషాలు
Miss universe | ఇజ్రాయెల్ దేశంలో 70వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు డిసెంబర్ 12న జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొన్నడానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరాంగులకు భారత్ నుంచి పోటీ ఇవ్వడానికి పంజాబీ గర్ల్ హర్నాజ్ సంధు(21) బయలుదేరింది. ఇటీవలే హర్నాజ్ లివా మిస్ దివా యూనివర్స్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది

ఇజ్రాయెల్ దేశంలో 70వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు డిసెంబర్ 12న జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొన్నడానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరాంగులకు భారత్ నుంచి పోటీ ఇవ్వడానికి పంజాబీ గర్ల్ హర్నాజ్ సంధు(21) బయలుదేరింది. ఇటీవలే హర్నాజ్ లివా మిస్ దివా యూనివర్స్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది. ఇప్పుడు మిస్ యూనివర్స్ టైటిల్‌ని సొంతం చేసుకోవాలనుకుంటోంది.
పంజాబ్ రాజధాని చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు వృత్తిపరంగా ఒక మోడల్. చండీగఢ్‌లోనే డిగ్రీ పూర్తి చేసిన హర్నాజ్ ప్రస్తుతం మాస్టర్స్ కూడా చదువుకుంటోంది. ఒకవైపు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొంటూ.. మరోవైపు చదువుని కొనసాగిస్తోంది ఈ 21 ఏళ్ల అమ్మడు.
17 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్ ప్రారంభించిన హర్నాజ్ ఇప్పటివరకు నాలుగు బ్యూటీ కాంటెస్ట్‌లలో విన్నర్‌గా నిలిచింది. 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్, 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, 2021 లో మిస్ యూనివర్స్ ఇండియా కితాబులను అందుకుంది.
స్కూల్ చదువుకునే రోజులలో హర్నాజ్ చాలా సన్నగా ఉండడంతో తోటి విద్యార్థులు ఆమెను ఏడ్పించేవారు. దీంతో కొంతకాలం ఆమె డిప్రెషన్ బారినపడింది. ఆ సమయంలో హర్నాజ్ కుటుంబం తోడుగా నిలబడడంతో ఆమె త్వరగా కోలుకొంది. మోడలింగ్, అందాలపోటీలలో ఇప్పటివరకు విజేతగా నిలిచిన ఈ అందాల భామ డైటింగ్ చేయనంటోంది. నోటికి రుచిగా ఉండేవి అన్నీతింటానని చెప్పింది. కానీ రోజూ వర్కౌట్స్ తప్పనిసరి అని చెప్పుకొచ్చింది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

