ఒకే ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ ప్యాసెంజర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. ఒక వ్యక్తిని రైలు కింద పడకుండా ప్రాణాలు కాపాడగలిగాడు. ఈ ఘటన అస్సాంలోని టిన్సుకియాలో చోటు చేసుకుంది.
టిన్సుకియా రైల్వే స్టేషన్లో అప్పుడే గౌహతి లెడో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది. ప్యాసెంజర్లు అందరూ ఎక్కారు. ట్రెయిన్ కదిలింది. ఇంతలో ఓ ముసలాయన.. రైలు ఎక్కబోయాడు. వెళ్తున్న రైలును ఎక్కేందుకు కొంత దూరం పరిగెత్తాడు. ఆ తర్వాత ట్రెయిన్ మెట్లు పట్టుకొని ఎక్కబోయాడు.. పట్టుతప్పాడు. కొంత దూరం వరకు అలాగే.. ప్లాట్ఫామ్, ట్రెయిన్ మధ్య లాక్కొని ముందుకు వెళ్లిపోయాడు. ఇంతలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ వెంటనే ఆ వృద్ధుడిని ప్లాట్ఫామ్ మీదకు లాగాడు. ఒక్క క్షణం ఆలస్యమై ఉన్నా.. ఆ వృద్ధుడు రైలు కింద పడి చనిపోయేవాడే.
ఎంతో సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి.. ఆ వృద్ధుడి ప్రాణాలను కాపాడిన రైల్వే పోలీసును అందరూ ప్రశంసల ముంచెత్తారు. ఈ ఘటన స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోను ఆర్పీఎఫ్ టిన్సుకియా డివిజన్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
On 11.12.21 on duty HC/A.B.Sikdar of RPF/Post/TSK promptly saved an old aged passenger while he tried to board in T/No.15603 Up (GHY – LLO) at TSK Rly station passenger's leg slipped in the running train & dragged with the train up to some distance @drm_tsk
— RPF Tinsukia Division (@NfrRpftsk) December 11, 2021
@RPFNFR pic.twitter.com/lOrpGIaeQd
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
21 ఏళ్ల క్రితం మిస్ అయిన ఇద్దరు టీనేజర్ల కేసును ప్రాణాలకు తెగించి ఛేదించిన యూట్యూబర్..
పబ్లో దెయ్యం.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్, రామ్చరణ్ను మరిపించేలా ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ వేసిన ఫారెనర్స్.. వైరల్ వీడియో
OTT | 2008లోనే భారత్లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్ఫామ్స్తో లాభమా? నష్టమా?
mini bengal | తెలంగాణలో మినీ బెంగాల్.. కట్టుబొట్టూ అంతా ఉత్తరాది స్టైలే !!
లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్ను మింగిన ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?