Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు యువకులు దుర్మరణం
హైదరాబాద్ రామంతాపూర్లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్తో (Electric Shock) ఇద్దరు యువకులు మృతిచెందారు.
హైదరాబాద్: హైదరాబాద్ రామంతాపూర్లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్తో (Electric Shock) ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రామంతాపూర్లోని గోఖలేనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథంపై శ్రీకృష్ణుడి ఉరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఆదివారం రాత్రి స్థానిక వీధుల్లో యాదవ సంఘం భవనం నుంచి శ్రీకృష్ణుడి ఉరేగింపు చేపట్టారు. ఓవైపు వర్షం పడుతుండగా మరోవైపు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి రథయాత్ర కొనసాగింది. ఉరేగింపు దాదాపు పూర్తయి తిరిగి రథాన్ని యాదవ సంఘ భవనం వద్ద పెట్టేందుకు వెళ్తుండగా రథాన్ని ముందుకు లాగుతున్న జీపు ఆగిపోయింది. మరో వంద అడుగుల దూరం ఉండటంతో చేతులతో తోస్తూ వెళ్లారు. మరో 50 అడుగుల దూరం ఉండగానే ఆకస్మాత్తుగా రథాన్ని లాగుతున్న వాళ్లు గట్టిగా అరుస్తూ కిందపడిపోయారు. అప్పటికే రథంపై ఉన్న వాళ్లు ఏం జరిగిందో అర్థం కాక పరుగులు పెట్టారు. వేలాడుతున్న విద్యుత్తు తీగ రథానికి తగిలి షాక్ కొట్టింది. దీంతో వెనుక నుంచి తోస్తున్న వాళ్లు 9 మంది అపస్మార స్థితిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు కొందరికి సీపీఆర్ కూడా చేసినా ఫలితం లేకుండాపోయింది. ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురిని చికిత్స కోసం వివిధ దవాఖానాలకు తరలించారు.
ఇవికూడా చదవండి..
కరెంట్ షాక్తో ఐదుగురు మృతి.. వేలాడుతున్న విద్యుత్తు తీగలు తగిలి ప్రమాదం
ఈ నగరానికి ఏమైంది.. పత్తాలేని పోలీస్.. జాడలేని జీహెచ్ఎంసీ!
తీరం దాటనున్న వాయుగుండం.. 24గంటల్లో భారీ వర్షాలు!
మురుగుకూపంగా మహానగరం.. సర్కారు నిర్లక్ష్యంతో అస్తవ్యస్తం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

