భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 18 : కోతులను తప్పించబోయి ప్రమాదవశాత్తు కారు ఫల్టీ కొట్టిన ఘటన మైసమ్మ కత్వ సమీపాన మంగళవారం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని రేవనపల్లి గ్రామానికి చెందిన సురుకంటి బస్వారెడ్డి పోచంపల్లి నుండి హైదరాబాద్ కు కారులో ప్రయాణిస్తున్నాడు. పోచంపల్లి- కొత్తగూడెం ప్రధాన రహదారిలో కత్వ సమీపంలో కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో రహదారిపై ఉన్న కోతులను తప్పించబోయి ప్రమాదవశాత్తు కారు ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్వారెడ్డి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.