BRS : హైదరాబాద్లో లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులకు రేవంత్రెడ్డి సర్కారు ‘22-A’ తో సంకెళ్లు వేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. సామాన్యుల ఆస్తులను, దశాబ్దాలుగా ఉంటున్న కాలనీలను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి నెట్టి, సామాన్యుడి కాళ్ల కింద నేలను లాక్ చేశారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఆస్తులు అమ్ముకోలేక, కనీసం బ్యాంకులో కుదువపెట్టి అప్పు తెచ్చుకోలేక ప్రజలు విలవిల్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రజల ఆస్తులను బందీ చేసిన ఈ తుగ్లక్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా నిలబడుతామని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు వారి ఆస్తులను ఇప్పిస్తామని చెప్పారు.