Telangana Assembly | ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. శాసనసభ రేపటికి వాయిదా
Telangana Assembly | శాసనసభ రేపటికి వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం గురువారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం అయ్యేందుకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Telangana Assembly | హైదరాబాద్ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం గురువారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం అయ్యేందుకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగా, ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చ ప్రారంభించారు.
గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మరోసారి గుర్తు చేస్తూ, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తిచూపుతూ కేటీఆర్ ప్రసంగం కొనసాగింది. ఇక కేటీఆర్ ప్రసంగానికి అధికార పార్టీకి చెందిన సభ్యులు పలువురు అడ్డు తగిలారు. అయినప్పటికీ కేటీఆర్ ఏ మాత్రం తగ్గకుండా కాంగ్రెస్ సర్కార్ మోసాలను ఎండగట్టారు.
ఇక సభలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ సబిత సీఎం రేవంత్‌ను నిలదీశారు. ఇక సీఎం మాటలకు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా వంతపాడారు. గందరగోళ పరిస్థితుల నడుమ సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మళ్లీ తిరిగి సభ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రారంభమైంది. సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ వినిపించుకోకుండా అధికార సభ్యుడు గడ్డం వివేక్‌కు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సబితకు మైక్ ఇచ్చేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం.. చివరకు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకుంది. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించడం కాదు.. అభిశంసించాలి : ఎమ్మెల్యే కేటీఆర్
KTR | రేవంత్ సర్కార్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది.. శాసనసభలో ఎమ్మెల్యే కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

