KTR | హైదరాబాద్ : గత పదేండ్లలో ఏం మంచి జరిగిందో చెబుదామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. మాట్లాడితే కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని అంటున్నారు.
చేరిపేయలేని, తుడిపేయలేని, దాచెయ్యలేని ఆనవాళ్లు కేసీఆర్ ఆనవాళ్లు. ఎలా చెడిపేస్తారు కేసీఆర్ ఆనవాళ్లను అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్.. కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్.. భగీరథ నల్ల నీళ్లలో కేసీఆర్.. పాలమూరు జలధారల్లో కేసీఆర్.. సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్.. గురుకుల బడిలో కేసీఆర్.. యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్.. విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్.. మెడికల్ కాలేజీల వైద్య విద్య విప్లవంలో కేసీఆర్.. కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్.. కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్‌లో కేసీఆర్.. మీరు కూర్చున్న సచివాలయపు సౌధ రాజసంలో కేసీఆర్.. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ సృజనలో కేసీఆర్.. వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్.. ప్రపంచంలోని అతి పెద్ద అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్.. అమర దీపం ఆశయల్లో కేసీఆర్.. అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టింది.. మాట్లాడితే కేసీఆర్ ఆనవాళ్లను తుడిపెస్తామని అంటున్నారు.
చేరిపేయలేని, తుడిపేయలేని, దాచెయ్యలేని ఆనవాళ్లు కేసీఆర్ ఆనవాళ్లు.
కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్.
కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్.
భగీరథ నల్ల నీళ్లలో కేసీఆర్.
పాలమూరు జలధారలో కేసీఆర్.… pic.twitter.com/1Rx1yuoZL5— Telugu Scribe (@TeluguScribe) July 31, 2024
ఇవి కూడా చదవండి..
KTR | విమర్శ కోసం విమర్శ చేయొద్దు.. భట్టి విక్రమార్కకు కేటీఆర్ చురకలు