KTR | హైదరాబాద్ : ప్రయివేటు రంగంలో ఉద్యోగాలకు 610 జీవో, ముల్కీ రూల్స్ అవసరం లేదని, అవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తాయని సీఎం రేవంత్ రెడ్డికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చురకలంటించారు. శాసనసభలో ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలసీలు తెస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పాలసీ తేలేదు. కేసీఆర్ అంటే జలసీ తప్ప.. ఏ పాలసీ తేలేదు. మహేశ్వరంను న్యూయార్క్‌లా, మూసీని లండన్ థేమ్స్ నదిలా మారుస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తేల్చుతారు. నేను చదువుకుని వచ్చాను. నేను రెండు మాస్టర్ డిగ్రీలు చదివాను. పుణెలో మాస్టర్స్‌లో బయోటెలక్నాలజీ చేశాను. న్యూయార్క్ వెళ్లి ఎంబీఏ చేశాను. గుంటూరులో కూడా ఇంటర్ చదివాను. అంతటా చదివాను. సర్టిఫికెట్లు చూపే పరిస్థితి నాకుంది. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. వారు ఎక్కడ చదువుకున్నారో నాకు తెల్వదు. ఏం చదువుకున్నారో తెల్వదు. నేనైతే కష్టపడ్డాను.. ఉద్యోగం సంపాదించాను. అదే ఉద్యోగం మీద ఇండియాకు వచ్చాను. మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాశాను. ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. ముఖ్యమంత్రి గతం గురించి నాకు తెల్వదు కానీ ఆయన గురించి రకరకాలుగా చెప్తారు. ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో అందరూ విన్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక రేవంత్ రెడ్డి చాలా అదృష్టవంతులు. చిన్న వయసులోనే సీఎం అయ్యారు. ఆయన గురించి గొప్పగా చెబుతున్నాను. రేవంత్ రెడ్డి దాదాపు 18 ఏండ్ల నుంచి నాకు తెలుసు. మంచి మిత్రులు.. చాలాసార్లు బయట మాట్లాడుకున్నాం. గత 10 ఏండ్లలో చెడింది.. అదే వేరే విషయం అని కేటీఆర్ తెలిపారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని.. నేను కొండారెడ్డిపల్లి, తాండ్ర, వనపర్తి, హైదరాబాద్‌లో ప్రభుత్వ విద్య అభ్యసించాను. నేనేం జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోలేదు. గుంటూరు కూడా పోలేదు. 610 జీవో, ముల్కీ రూల్స్ అప్లై చేసినా.. తెలంగాణలోని ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది. మరి గుంటూరులో చదువుకున్న వారికి అర్హత ఉందో లేదో తెలియదు అని రేవంత్ వ్యాఖ్యానించారు.
వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. గుంటూరులో 11, 12 చదివాను. విజ్ఞాన్‌లో చదివాను అనే విషయం చెబుతూనే ఉన్నాను. దాచడం లేదు. కానీ ప్రయివేటు రంగంలో ఉద్యోగం సంపాదించాను. 610 జీవో ప్రయివేటు రంగంలో వర్తించదు.. కేవలం ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుందన్న విషయం గ్రహించాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.
ముఖ్యమంత్రి గతం ఏందో నాకు తెలియదు.. రకరకాలుగా అంటుంటారు కానీ అవి ఏంటో నాకు తెలియదు
నేను మాత్రం అంతో ఇంతో చదువుకున్న, ఉద్యోగం చేసిన.. వాళ్లు ఎక్కడ చదువుకున్నారో, ఏం చదువుకున్నారో నాకు తెలియదు – కేటీఆర్ pic.twitter.com/rl2Mdm5Kss
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2024
ఇవి కూడా చదవండి..
KTR | విమర్శ కోసం విమర్శ చేయొద్దు.. భట్టి విక్రమార్కకు కేటీఆర్ చురకలు
KTR | భారతదేశ భాగ్యరేఖలను మార్చే రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలబడింది : ఎమ్మెల్యే కేటీఆర్