KTR | హైదరాబాద్ : ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఉద్యోగ నియామకాలపై కేటీఆర్ మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అశోక్‌నగర్ వచ్చారు రాహుల్ గాంధీ. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నిజంగా రాహుల్ ట్వీట్, వీరి నిర్వాకం చూసిన తర్వాత గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల దగ్గర ట్యూషన్ నేర్చుంటా అని పోతుండే. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని బడ్జెట్లో చెప్పారు. నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు.. పరీక్ష ఎప్పుడు జరిగింది. నియామకాలు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆ 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడో ఇచ్చామో తేదీలు ఉన్నాయి. స్టాఫ్ నర్సులకు 2022 డిసెంబర్ 20న నోటిఫికేషన్ ఇచ్చి 2023 ఆగస్టులో పరీక్షలు నిర్వహించాం. సింగరేణి ఉద్యోగులకు 2022 జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చి అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించాం. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చాం. 2022 ఆగస్టులో ప్రిలిమ్స్, 2023 జనవరిలో ఫిజికల్ టెస్టులు, 2023 ఏప్రిల్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాం. ఇవన్నీ కలిపి 30 వేల ఉద్యోగాలు మేం ఇచ్చాం మేం ఇచ్చాం అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు వీరు నియామక ప్రతాలు ఇచ్చారు. ప్రజలను, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించిన మీ మీద ఛార్జిషీటు వేయాలి. జాబుల జాతర బదులు అబద్దాల జాతర నడుస్తుంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ మరో నాలుగు నెలల్లో మారిపోతది కానీ జాబ్ క్యాలెండర్ అత్త లేదు.. పత్త లేదు అని కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికల సమయంలో అశోక్‌నగర్‌కు, ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ వెళ్లారు. సభ వాయిదా వేయగానే డిప్యూటీ సీఎం భట్టి, అవసరమైతే సీఎం రేవంత్‌ను కూడా తీసుకెళ్దాం. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్‌గా వెళ్దాం. అశోక్‌నగర్‌లో ఏ ఒక్క యువతి, యువకుడు అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క ఉద్యోగం వచ్చిందని చెప్పినా.. అక్కడే నేను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చారని ఎవరైనా చెబితే అక్కడే ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో మా పార్టీ తరపున లక్షలాది యువకులతో సీఎం, డిప్యూటీ సీఎంకు పౌర సన్మానం చేయిస్తానని కేటీఆర్ తెలిపారు.
అసెంబ్లీలో కేటీఆర్ సవాల్
కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక్క ఉద్యోగం ఇచ్చారని ఒక్క విద్యార్థి చెప్పిన నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా – కేటీఆర్ pic.twitter.com/xcGfM0Iw07
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2024
ఇవి కూడా చదవండి..
KTR | విమర్శ కోసం విమర్శ చేయొద్దు.. భట్టి విక్రమార్కకు కేటీఆర్ చురకలు
KTR | భారతదేశ భాగ్యరేఖలను మార్చే రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలబడింది : ఎమ్మెల్యే కేటీఆర్
KTR | భవిష్యత్‌లో భట్టి పక్క కుర్చీలోకి వెళ్లాలి.. మనసారా కోరుకుంటున్నాన్న కేటీఆర్