KTR | హైదరాబాద్ : ప్రస్తుతం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భవిష్యత్‌లో పక్క కుర్చీలోకి వెళ్లాలని(సీఎం కుర్చీ) మనసారా కోరుకుంటున్నట్టు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
పదేండ్ల తర్వాత తెలంగాణ గురించి ప్రస్తావించే సందర్భంలో ముందు ఉన్న పరిస్థితులను కూడా మననం చేసుకోవాలి. గత ప్రభుత్వం.. గతం గతం అంటూ పురావస్తు శాఖ తవ్వినట్టు తవ్వుతూనే ఉన్నారు అధికారం పక్షం నేతలు. మాకు కూడా తప్పదు మేం కూడా తవ్వాలి. ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది చక్కటి బడ్జెట్ అన్నారు. ఇలానే మరింత ఉన్నతిని సాధించాలని, భవిష్యత్‌లో పక్క కుర్చీలోకి పోవాలని మనసారా కోరుకుంటున్నాను.. భట్టి విక్రమార్కకు ఆ అర్హత ఉందని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
Srisailam project | నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
Harish Rao | రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు.. వరుస లైంగిక దాడులు సిగ్గుచేటు : హరీశ్‌రావు
Crime news | 24 గంటల్లో మూడు రేప్‌లు.. కదులుతున్న బస్సులో మహిళపై అఘాయిత్యం