Srisailam project | నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
Srisailam project | ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. నీటిని దిగువకు పంపేందుకు గేట్లు తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మంగళవారం రాత్రి 10 గేట్లను పదేసి అడుగుల మేర పైకి ఎత్తారు. దిగువన నాగార్జున సాగర్‌కు 3.59 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Srisailam project : ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. నీటిని దిగువకు పంపేందుకు గేట్లు తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మంగళవారం రాత్రి 10 గేట్లను పదేసి అడుగుల మేర పైకి ఎత్తారు. దిగువన నాగార్జున సాగర్‌కు 3.59 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదిలావుంటే జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి మొత్తం 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.90 అడుగులకు చేరింది. నీటి నిలువ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 209.59 టీఎంసీల నీరు నిలువ ఉంది.
తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 35,315 క్యూసెక్కుల నీటి సాయంతో 18.437 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా.. ఏపీ పరిధిలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 25,684 క్యూసెక్కుల నీటితో 15.201 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

