KTR | హైదరాబాద్ : ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ.. ఉజ్వల తెలంగాణగా ఎదుగుతున్న క్రమంలో రాష్ట్రం దివాళా తీసింది.. క్యాన్సర్, ఎయిడ్స్ పేషెంట్లా మారిందని అధికార పక్షం నేతలు మాట్లాడడం సరికాదని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుబట్టారు. పదేండ్ల ప్రస్థానంలో తెలంగాణ తన సొంత కాళ్ల మీద నిటారుగా నిలబడ్డది. అనేక మంది శాపనార్థాలను తట్టుకొని, సవాళ్లను అధిగమించి ఇవాళ తెలంగాణ సిరిసిపందలతో బారతదేశ భాగ్యరేఖలను మార్చే రాష్ట్రాంగా అగ్రభాగాన నిలబడింది అని కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
దివ్యాంగ ఉన్న రాష్ట్రం దివాళ తీసింది. ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ సభ్యులు మాట్లాడడం సరికాదు. ఇది శుద్ధ తప్పు. ఈ ప్రచారం తప్పు అని రేవంత్, భట్టి ముఖచిత్రంతో వేసిన మీ సోషియో ఎకానమిక్ అవుట్ లుక్ చెబుతుంది. మాటలతో మసిబూసి మారెడు కాయ చేస్తున్నారు భట్టి విక్రమార్క. ఆర్బీఐ గణాంకాలు నిజాలను నిగ్గు తేలస్తున్నాయి. సత్యాల మీద ముసుగులు వేయడం అంత సులభం కాదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
భారతదేశంలోనే తెలంగాణ 74 శాతం డెవలప్మెంట్ ఎక్స్పెండించర్త్ అగ్రభాగాన ఉన్నట్లు ఆర్బీఐ లెక్కలను సోషియో ఎకానమిక్ అవుట్ లుక్‌లో కోట్ చేశారు. ఇప్పుడేమో జీతాలకు పైసల్లేవు. అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నామని చెబుతున్నారు. వాస్తవం ఏందంటే.. కమిటెడ్ ఎక్స్పెండిచర్ గురించి తెలుసుకోవాలి. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు కలపడమే దీని అర్థం. ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే మనం చాలా బెటర్‌గా ఉన్నాం. తెలంగాణలో రూపాయిలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ 47 పోతే 53 పైసలు అదనంగా ఉన్నాయి. కేరళలో 82 పైసలు, హర్యానాలో 81 పైసలు, పంజాబ్‌లో 79 పైసలు, వెస్ట్ బెంగాల్లో 69, ఏపీలో 61, రాజస్థాన్‌లో 59 పైసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద పోతున్నాయి. జాతీయ సగటు 56 పైసలు. కమిటెడ్ ఎక్స్పెండిచర్లో అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. తిమ్మినిబమ్మి చేయొద్దని సూచిస్తున్నా. వడ్డీలు, జీతాల కోసం డబ్బులు సరిపోవట్లేదని వారు మాట్లాడడం సరికాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | భవిష్యత్‌లో భట్టి పక్క కుర్చీలోకి వెళ్లాలి.. మనసారా కోరుకుంటున్నాన్న కేటీఆర్
Srisailam project | నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ