
(PG classes) హైదరాబాద్: తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఒకే రోజు నుంచి తరగతులు మొదలవుతాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలోని ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు కామన్ అకాడమిక్ కాలెండర్ను అమలుచేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. దీనికి వైస్ఛాన్స్లర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ మొదటి విడుత కౌన్సిలింగ్ ఇప్పటికే పూర్తికాగా, 23,647 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం రెండో విడుత కౌన్సిలింగ్ కొనసాగుతున్నది. పూర్తి అకాడమిక్ క్యాలెండర్ను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసి అమలుచేయనున్నట్లుగా సమాచారం.
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..