నల్లగొండ, జూన్ 10 : బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్(బి సి టి ఏ) రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో బుధవారం నిర్వహించిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని, 40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు, డీఏలు వెంటనే చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని బీసీ ఉపాధ్యాయులకు సైతం వేతనంతో కూడిన ఉన్నత విద్య సెలవులు మంజూరు చేయాలని, ప్రాథమిక పాఠశాల విలీనం చేయవద్దని ప్రభుత్వంను కోరడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శిరందాసు రామదాసు, ప్రధాన కార్యదర్శిగా నల్లబోతు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండలి రవికుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మి నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరి నారాయణ యాదవ్, సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, ఏడుకొండలు, గిరిబాబు, స్వామి, శ్రీను, తిరందాసు సంతోష్, కృష్ణయ్య పాల్గొన్నారు.